బన్ని పుష్ప పాన్ ఇండియా రిలీజ్.. ఎందుకంటే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ మూవీ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే హ్యాట్రిక్ మూవీ అవడం విశేషం. ఈ సినిమాను ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను ముందు తెలుగులో మాత్రమే చేయాలని అనుకున్నారట. కాని బన్ని సినిమాలు డబ్బింగ్ అయ్యి బాలీవుడ్ లో సంచలన విజయాలు అందుకుంటున్నాయి. బన్ని సరైనోడు, నా పేరు సూర్య సినిమాలు హింది డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటాయి. డబ్బింగ్ సినిమాలే ఈ రేంజ్ లో హిట్టైతే ఇక స్ట్రైట్ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో అని అల్లు అర్జున్ తనకు కెరియర్ లో మొదటి సూపర్ హిట్ ఇచ్చిన ఆర్య డైరక్టర్ సుకుమార్ తో ఈ మెగా ప్లాన్ వేశాడు.
ఇప్పుడు స్టార్ సినిమా కొద్దిగా బడ్జెట్ ఎక్కువవుతుంది.. యూనివర్సల్ కాన్సెప్ట్ అని అనుకుంటే దాన్ని నేషనల్ వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో తీసే సినిమాలే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా నిఖిల్ కార్తికేయ 2, విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మూవీ ఉన్నాయి వాటితో పాటుగా అల్లు అర్జున్ పుష్ప కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఈ సినిమాలన్ని సూపర్ హిట్ అయితే తెలుగు సినిమా స్తామినా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.