జగపతి బాబు అలవాట్ల పై కృష్ణవంశీ వ్యాఖ్యలు !

Seetha Sailaja

ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు గతంలో సినిమాలలో అవకాశాలు తగ్గిన పరిస్థితులలో రకరకాల అలవాట్లకు లోనై ఆర్ధికంగా బాగా నష్టపోయిన విషయాలు తెలిసినవే. ఈ విషయాలను ఎటువంటి మొహమాటాలు లేకుండా జగపతిబాబు అనేకసార్లు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పాడు.


క్రియేటివ్ దర్శకుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ జగపతి బాబుల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘అంత:పురం’ మూవీలో  జగపతిబాబు నటనకు మంచి ప్రశంసలతో పాటు అవార్డులు కూడ దక్కాయి. ఆ మూవీలో జగపతిబాబు ప్రదర్శించిన అద్భుతమైన నటనకు కారణం జగపతి బాబు ఆ మూవీ షూటింగ్ స్పాట్ లో మద్యం సేవించడం అంటూ కృష్ణవంశీ అప్పటి విషయాలను ఇప్పుడు బయటపెట్టాడు. ‘అంత:పురం’ మూవీలో సీన్ బాగా రావడం కోసం మద్యం సేవించి నటిస్తానని అప్పుడే తన నటనలో సహజత్వం ఉంటుందని జగపతి బాబు చెప్పడంతో తానే స్వయంగా పెగ్గు కలిపి జగపతిబాబుకు ఇచ్చేవాడిని అని అన్న విషయం కృష్ణవంశీ చెపుతున్నాడు.


లిమిట్ గా తాగడం వల్ల జగపతి వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తలేదని అంతేకాకుండా ఆ మూవీలో అతడి సహజ నటనకు మంచి స్పందన వచ్చింది అని చెపుతున్నాడు. ‘అంత:పురం’ చిత్రంలో జగపతిబాబు నటన ఆయన కెరీర్ లోనే బెస్ట్ గా ఇప్పటికీ విమర్శకులు గుర్తిస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో జగపతిబాబు చనిపోయే సీన్ ఆ సినిమాకు అత్యంత కీలకం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ జగపతిబాబు పాత్రను ఈ సినిమాలో తీర్చిదిద్దిన తీరు అద్బుతం అంటూ అప్పట్లో అనేక ప్రశంసలు వచ్చాయి.


గతంలో ఎన్టీఆర్ లాంటి మహానటుడు రాముడు కృష్ణుడు పాత్రలు పోషించే సమయంలో నాన్ విజ్ తినకుండా కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ తన పాత్రల కోసం తెగ తపన పడేవారు అని అంటారు. ఇప్పుడు జగపతి బాబు కూడ ఎన్టీఆర్ తీరును అనుసరిస్తూ తన పాత్ర కోసం మధ్య సేవించి మరీ సహజంగా నటించాడు అంటే ఒక పాత్ర విషయంలో జగపతి బాబు ఎంత కష్టపడతాడో అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: