OTTలో 'V'..?.. సెల్ ఫోన్ లో చూసే సినిమా కాదన్నారు..!
నాచురల్ స్టార్ నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'వి'. దిల్ రాజు నిర్మించిన అసలైతే మార్చి 25న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడ్డది. ఈ సినిమాలో నాని తో పాటుగా సుధీర్ బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సినిమాలో నాని ఫుల్ లెంగ్త్ లో నెగటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమా నుండి అప్పట్లో రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి.. సినిమా థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం కనిపించడం లేదు.. అందుకే మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాని వి సినిమా కూడా ఓటిటి రిలీజ్ అని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆ వార్తలను ఖండిస్తూ మా సినిమా సెల్ ఫోన్ లో చూసేది కాదు.. థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఓటిటి లో కూడా సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుండగా స్మాల్ బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు మొగ్గుచూపుతున్నారు.
నాని 'వి' సినిమాకు కూడా ఓటిటిల నుండి ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చాయట. 35 కోట్ల దాకా డిజిటల్ రేటు పలికిందని తెలుస్తుంది. వీటితో పాటుగా శాటిలైట్ రైట్స్ కూడా వస్తాయి కాబట్టి సినిమా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ఈసారి పే పర్ వ్యూ విధానాన్ని ప్రవేశపెడుతున్నారట. మొత్తానికి నాని వి సినిమా కూడా ఓటిటికే ఓటు వేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి నాని వి డిజిటల్ రిలీజ్ రెస్పాన్స్ పై వచ్చే వార్తలపై అఫీషియల్ అప్డేట్ చూడాలి.