మోక్షజ్ఞ మూవీ.. రేసులో మరో స్టార్ డైరక్టర్..!
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలోనే మోక్షజ్ఞ నటిస్తాడని వార్తలు రాగా అది మిస్సయింది. ఆ తర్వాత క్రిష్ డైరక్షన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో అయినా మోక్షజ్ఞ ఉంటుందని అనుకోగా అందులో కూడా కనిపించలేదు. అప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు రాగా కొద్దిరోజుల క్రితం అసలు మోక్షజ్ఞకు హీరో అయ్యే ఆలోచన లేదని షాక్ ఇచ్చారు.
ఫైనల్ గా మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ ఆశలు రేపెలా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది కానీ దానికి టైం పడుతుంది అంటున్నాడు. రైటర్ సాయి మాధవ్ బుర్ర మెగా ఫోన్ పట్టుకుని మోక్షజ్ఞతో హీరోగా సినిమా చేస్తాడని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియకముందే మోక్షజ్ఞ ఎంట్రీ సాయి మాధవ్ బుర్ర డైరక్షన్ లో కాదు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో అంటూ కొత్త న్యూస్ వైరల్ గా మారింది. వారసుడి ఎంట్రీకి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారన్న కారణంతో రోజుకొక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కొందరు.
ఇంతకీ బాలయ్య మనసులో ఏముంది.. మోక్షజ్ఞని ఎవరి చేతుల్లో పెడుతున్నాడు.. ఇలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని అంటున్నారు. అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్-3 స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ తర్వాత మోక్షజ్ఞ సినిమానే డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి అదే నిజమైతే మోక్షజ్ఞ మొదటి సినిమా పక్కా హిట్టు అన్నట్టే. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు సక్సెస్ ట్రాక్ లో ఉన్న అనీల్ రావిపూడి తప్పకుండా మోక్షజ్ఞతో హిట్టు కొట్టేస్తాడని అంటున్నారు.