క్లైమాక్స్ 100 కాదు ఫ్రీ షో వేసినా చూడలేం..!

KSK

రామ్ గోపాల్ వర్మ తెలుగు ఇండస్ట్రీలో మొదటిలో ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేస్తూ అనేక సంచలనాలు సృష్టించారు. ఎన్నో వివాదాలు తట్టిలేపి వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మాఫియా మరియు హారర్ నేపథ్యంలో సినిమాలను తీయడంలో సిద్ధహస్తుడు అయినా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ ప్రస్తుతం చెత్త సినిమాలు చేసే దిశగా కొనసాగుతున్నట్లు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక పేరుగాంచిన సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకి అసలు ప్రేక్షకాదరణ దక్కటం లేదు. వివాద అంశాల సినిమాలను టచ్ చేసి తెరకెక్కిస్తున్నా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడంతో పాటు విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా ధియేటర్లు క్లోజ్ అవటంతో వర్మ దర్శకత్వంలో మియా మాల్కోవా, రెనాన్ సేవరో లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా క్లైమాక్స్ డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ తో ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెంచేసిన రామ్ గోపాల్ వర్మ...అసలు సరుకు దింపేప్పటికీ దానిలో విషయం లేకపోవడంతో ప్రేక్షకులు ‘క్లైమాక్స్’ సినిమా చూసి వర్మ కెరియర్ క్లైమాక్స్ కి వచ్చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. లాక్ డౌన్ టైం లో వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటిలో హైప్ బాగా వచ్చింది.

ఈ నేపథ్యంలో సినిమా లు ఏమీ రిలీజ్ అవ్వని సమయంలో OTT లో 100 రూపాయలకే సినిమా చూసే అవకాశం రావటంతో ప్రేక్షకులు బాగా ఎగ్జైట్ అయ్యారు. తీరా సినిమా చూశాక వంద రూపాయలు కాదు కదా ఫ్రీగా షో వేసిన అందులో చూడటానికి సినిమా ఏమీ లేదని వర్మ డైరెక్షన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు సినిమాలో స్టోరీ ఏమీ లేదని, కిస్సింగ్ సన్నివేశాలకు మాత్రమే 'క్లైమాక్స్' సినిమా ఉందని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  సినిమాకి ఒకే ఒక హైలైట్ మియా మాల్కోవా చూపించిన అందాలు అని అంటున్నారు. ఆర్జివి డైరెక్షన్ సత్తా నీరుగారిపోయింది అంటూ చాలామంది సినిమా చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: