ఇళయరాజా గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..!
తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషా చిత్రాలకి సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఇళయరాజా 1943 జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించాడు. నిజానికి ఇతని అసలు పేరు ఇళయరాజా కాదు. ఇళయరాజా పుట్టినప్పుడు తల్లిదండ్రులు అతనికి జ్ఞానతీసిఖాన్ అనే పేరు పెట్టారు. అయితే తన పేరు కాలక్రమేణా ఇసైజ్ఞాని, రాజా, చివరాకరికి ఇళయరాజా మారిపోయింది. సినీరంగంలో అడుగుపెట్టిన తర్వాత తన పేరు ఇళయరాజా గా శాశ్వతమైంది. అతనికి తన సంగీత జీవితంలో 5 నేషనల్ ఫిలిం అవార్డ్స్ లభించాయి.
మూడు అవార్డులు సంగీతదర్శకత్వం వహించినందుకు గాను రాగా మరొక మూడు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వచ్చాయి. 2012 సంవత్సరంలో అత్యుత్తమ విలువగల సంగీత నాటక అకాడమీ అవార్డు అతనికి లభించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన దళపతి(1991) సినిమా లో సింగారాల పైరుల్లోన అనే పాటకి సంగీతం సమకూర్చిన ఇళయరాజా ఖ్యాతి భారత దేశ వ్యాప్తంగా పాకింది. ఈ సినిమాలో చిలకమ్మ చిటికేయంగా అనే పాట నూట అరవై దేశాల్లో కోట్ల మంది ప్రేక్షకాదరణ పొంది ప్రపంచంలోనే అత్యుత్తమ పది పాటలలో నాలుగవ స్థానాన్ని సంపాదించింది.
తన చిన్నతనంలో పాఠశాలలో చేరినప్పుడు అతని పేరు రాజయ్య గా తన తండ్రి మార్చాడు. కానీ తన గ్రామమైన పన్నైపురం వాసులు అతని రాజయ్య గా పిలిచేవారు. అయితే తమ సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆ మాస్టర్ తనకి రాజా అనే పేరు పెట్టాడు. ఇళయరాజా మొదటి సినిమా అన్నాకిలి పాత ఆయన అరుణాచలం అతనికి రాజా ముందు ఇళయ అనే పేరు పెట్టాడు. దాంతో అప్పటివరకు రాజా గా ఉన్న తన పేరు ఇళయరాజా గా మారిపోయింది. తను జీవ అనే ఓ మహిళను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరణే కూడా మ్యూజిక్ రంగంలోనే అడుగుపెట్టారు. అక్టోబర్ 31వ తేదీన 2011వ సంవత్సరంలో ఇళయరాజా భార్య జీవ గుండె నొప్పితో మరణించింది.