గ్రౌండ్ లో సిక్సులే కాదు ఇంట్లో డ్యాన్సులు అదరగొడుతున్నాడు..!

shami

ఎప్పటి నుండో ఉన్న టాలెంటో లేక మన పాటలు విన్న ఊపో తెలియదు కానీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిపోయే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈమధ్య సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చేస్తున్న డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాములుగా స్టార్స్ కు ఫ్యాన్స్ ఉంటారు. క్రికెటర్స్ కు అంతకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. ఇప్పుడు వారందరిని అలరిస్తూ తన వీడియోస్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటున్నాడు వార్నర్. 

 

అల వైకుంఠపురములో బట్ట బొమ్మ సాంగ్ నుండి మొదలైన వార్నర్ సాంగ్స్ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. వార్నర్ ఎప్పుడు ఎలాంటి వీడియోతోని సర్ ప్రైజ్ చేస్తాడా అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. గ్రౌండ్ లో సిక్సులు ఎలా పర్ఫెక్ట్ గా కొడతాడా అలానే డ్యాన్స్ మూమెంట్స్ లో పర్ఫెక్షన్ కోసం బాగానే ప్రయత్నిస్తున్నాడు వార్నర్. నిజంగా వార్నర్ చేస్తున్న ఈ తెలుగు సినిమా పాటలకు మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. 

 

లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మైండ్ బ్లాక్ సాంగ్ తో రెచ్చిపోయాడు వార్నర్. పక్కన సతీమణితో వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ చేస్తుంటే ఆ కిక్కు వేరేలా ఉంది. ఇక వార్నర్ కేవలం మన తెలుగు సాంగ్స్ చేయడానికి కారణం ఏంటంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ గా గత కొన్ని సీజన్లుగా మన వాళ్లకు దగ్గరయ్యాడు వార్నర్. అందుకే ఆయనకు తెలుగు సినిమాలు, తెలుగు ఆడియెన్స్ టేస్ట్ తెలిసింది. 

 

ఖాళీ టైం లో తాను ఎంజాయ్ చేస్తూ తన ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ అయ్యేలా చేస్తున్న వార్నర్ కు రాబోయే రోజుల్లో సినిమా ఛాన్సులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూరి జగన్నాథ్ వార్నర్ కు ఛాన్స్ ఇస్తానని ఎనౌన్స్ చేశాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: