పవన్ కోసం గద్దర్ వ్యూహాత్మక ఆలోచన !

Seetha Sailaja
పవన్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ప్రసంగం లైవ్ టెలికాస్ట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపధ్యంలో పవన్ హవా తెలంగాణ రాష్ట్రంలో కూడ చాపకింద నీరులా విస్తరిస్తోంది అని చెప్పే ఆసక్తికర సంఘటన ఈరోజు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈరోజు తాజాగా పవన్ కల్యాణ్ తన చిరకాల మిత్రుడైన ప్రజా గాయకుడు గద్దర్ సహాయంతో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నేతలతో సమావేశమైనట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘాలను పక్కనబెట్టిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై అలిగిన వారిని తనవైపు తిప్పుకునేందుకు పవన్ ఈమేరకు గద్దర్ సహాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌పై గుర్రుగా వున్న విద్యార్థి నేతలంతా గద్దర్ పిలుపుతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు సుముఖత చూపడంతో పవన్ వారితో భేటీ అయినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ను రెండు రాష్ట్రాలలోను పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు అనే విషయం దీనిని బట్టి అర్ధం అవుతోంది.  మెగా కుటుంబంలో చీలిక వచ్చిందని మీడియా వార్తలు రాస్తున్నా తమకు మెగా కుటుంబం అంతా ఒకటే అనీ మెగా అభిమానులు మీడియా సాక్షిగా బహిరంగంగా చెపుతూ ఉండడంతో పవన్ వెనుక మెగా అభిమానులంతా ఎంత మద్దతు ఇస్తున్నారు అనే విషయం అర్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: