తెలుగులో డబ్ కాబడిన హ్యారీ పోటర్ చిత్రం అందర్నీ ఫిదా చేసిందా..?

Suma Kallamadi

ప్రముఖ అమెరికన్ రచయిత్రి జె.కె.రౌలింగ్ రాసిన నవల ఆధారంగా తలకెక్కిన బ్రిటిష్ అమెరికన్ ఫిల్మ్ సిరీస్ అయిన హ్యారీ పోటర్ ప్రపంచ దేశాలలో కోట్ల మంది ప్రజల ఆదరణ పొందింది. క్రిస్ కొలంబస్, మైకే నేవెల్, డేవిడ్ యాట్స్ అలాఫోన్సో లాంటి ప్రముఖ డైరెక్టర్లు హ్యారీ పోటర్ చిత్రాన్ని 8 విభాగాల్లో తెరకెక్కించగా... ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో డానియల్ రాడ్ క్లిప్, ఎమ్మా వాట్సన్, రూపెర్ట్ గ్రీట్ నటించారు. ఈ చిత్రంలో హ్యారీ పాటర్ అనే యువకుడి గురించి, అతను హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అండ్ విజార్డ్రీ పాఠశాలలో చదువుతున్నప్పుడు, మ్యాజిక్ ఎలా చేయాలో నేర్చుకుంటాడు. ఈ క్రమంలో తనకు ఆర్కినమీ లార్డ్ వోల్డ్‌మార్ట్‌ కి శత్రుత్వం ఏర్పడుతుంది. 


ఇలా వీళ్లిద్దరి మధ్య కొనసాగే ఎన్నో సంఘటనలు ఉత్కంఠ భరితంగా ఉంటాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కల్పితమై అయినప్పటికీ నిజంగానే ఇది జరిగిందా అనేట్లు స్టోరీలైన్ వుంటుంది. ఈ సినిమాలు చూస్తుంటే వేరొక ప్రపంచంలోకి పర్యటన చేస్తున్నట్లు ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలు మన జీవితానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలన్నీ ఒక్కసారి చూస్తే మాటల్లో వర్ణించలేని సంతృప్తి తో పాటు జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు తెలుస్తాయి.


ఇకపోతే ఈ చిత్రంలో హ్యారీ పోటర్ తోటి విద్యార్థి అయిన డ్రాకో మాల్ఫోయ్(టామ్ ఫెల్ట‌న్) అతడిపై గొడవలు పెట్టుకుంటాడు. హెర్మియోన్‌ గ్రాంగర్‌(ఎమ్మా వాట్సన్), రాన్ వెస్లీ(రూపెర్ట్ గ్రింట్) హ్యారీ పోటర్ కి స్నేహితులు అయ్యి ప్రతి విషయంలో అండగా నిలుస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పార్టు తెలుగు లో డబ్ చేయగా... లక్షలాది మంది ప్రజలు చిత్రం యొక్క గొప్పతనానికి మంత్రముగ్దులయ్యారు. ఎంతోమంది ప్రేక్షకులకు ఈ సినిమా ఫేవరెట్ మూవీ గా మారింది అంటే అతిశయోక్తి కాదు. కేవలం భారత దేశంలో మాత్రమే కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాన్ ఇరాక్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దేశంలో హ్యారీ పోటర్ కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: