ప్రస్తుతం టాలీవుడ్ లోమారుతీ పుణ్యామా అని చిన్న సినిమాలు చాలామటుకు బూతు సినిమాలుగా మారిపోతున్నాయి. యూత్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, బెడ్ రూం సీన్స్, మితిమీరిన ఎక్స్ పోజింగ్ మాత్రమే కనిపిస్తు తెలుగు సినిమాల స్థాయి ఇదా అని ఆశ్చర్య పోయేలా చేస్తున్నాయి.
బస్ స్టాప్, రొమాన్స్ సినిమాలతో ప్రిన్స్ టాలీవుడ్ బూతు సినిమాల హీరోగా మారిపోయాడు. ఈ మధ్యనే తమిళ హీరో మహాత్ తో కలిసి బన్నీ అండ్ చెర్రీ సినిమాతో వచ్చినా ప్రిన్స్ కు పెద్దగా సక్సెస్ రాలేదు. అందుకే ఇప్పుడు మళ్లీ బూతుబాటలోకే వెళ్ళినట్లుగా ఉన్నాడు ప్రిన్స్. ప్రస్తుతం ‘డాలర్స్ కాలనీ’ అనే సినిమా చేస్తున్నాడు ప్రిన్స్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ఈ స్టిల్స్ ను బట్టి చూస్తే ఇది కూడా రొమాన్స్ లాంటి బూతు సినిమానే అనిపిస్తోంది. ప్రిన్స్ కు జోడిగా నిఖితా పవార్ అనే అమ్మాయిని పరిచయం చేస్తూ శ్రీ చంద్ ముల్లా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తి అయిన, ఈ సినిమా బూతు కంటెంట్ ఎక్కువగా ఉండే సినిమాలాగే ఉంది అంటూ ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: