త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు

Gullapally Rajesh

తెలుగులో త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల తో పాటుగా టాలీవుడ్ హీరోలకు కూడా ఒక ఆసక్తి అనేది ఉంటుంది. అతని సినిమాల కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అల్లు అర్జున్ తో చేసిన సినిమా సూపర్ హిట్ కావడం తో మాటల మాంత్రికుడు క్రేజ్ బాగా పెరిగింది అని అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చెయ్యాలి అని చూస్తున్నాడు. అయితే ఆ సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. 

 

ఇప్పుడు ఆ సినిమాను వాయిదా వేసుకుంటే మాత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ వెళ్లి బన్సాలి దర్శకత్వం లో ఒక సినిమాను పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ ఆ సినిమాను పూర్తి చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడు ఈ సినిమాను లేట్ గా చేస్తే అప్పుడు త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమా యిప్పుడు ఆర్ఆర్ఆర్ మీద ఆధారపడి ఉంది అని సమాచారం ఆర్ఆర్ఆర్ లేట్ అయితే మాత్రం ఈ సినిమాను లేట్ గా చేస్తారు అని తెలుస్తుంది. 

 

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ నానీ తో సినిమాకు సంబంధించి ఒక కథ ను సిద్దంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నానీ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలో స్పష్టత రావడం ఖాయంగా కనపడుతుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసే సినిమా కథను ఇప్పటికే పూర్తిగా సిద్దం చేసుకున్నాడు కూడా. మరి ఈ సినిమా వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: