మహేష్ ఆ విషయంలో గ్రేట్ ..నమ్రత !!
మహేష్ సినిమాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. సినిమా షూటింగ్ కి ఎప్పుడైతే కాస్త విరామం దొరుకుతుందో ఫ్యామిలీతో ఎంచక్కా హాలిడే టూర్స్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయం మనకు తెలియంది ఏమీకాదు ఆ మధ్య సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ కాస్త వాయిదాపడడంతో మహేష్ తన ఫామిలీ ని వెంటపెట్టుకొని వెళ్లి మరీ హాలిడేస్ ఎంజాయ్ చేశాడు. మహేష్ తన ఫ్యామిలీ ని ఎంత మిస్ అవుతాడో ఈ ట్రిప్స్ ముగిసేటయానికి తన ఫ్యామిలీకి అర్థమౌతుంది. మహేష్ గురించి నమ్రత చేబుతూ.. మహేష్ తన పిల్లలతో చాల ఫ్రెండ్లీ గా ఉంటాడని చెప్పింది. ఈ లాక్ డౌన్ సమయంలో తన పిల్లలతో మహేష్ మెలుగుతున్నవిధానాన్ని తాను తన సోషల్ మీడియా ద్వారా వివరించే ప్రయత్నం చేసింది.
మహేష్ తనకూతురు సితార ఆంటే ఎంతో ప్రేమగా మెలుగుతాడని చెప్పింది. అంతే ప్రేమను గౌతమ్ విషయంలో కూడా చూపిస్తాడని చెప్పింది. పిల్లలు స్కూల్ కి వెళ్లేవిషయంలో మారాం చేస్తే మహేష్ పెద్దగా ఏమి అనడు అని చెప్పింది అదేవిధంగా మీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళండి లేకపోతే ఇంట్లో నే ఉండండని చెప్పి తానూ వెళ్ళిపోతాడని చెప్పుకొచ్చింది. కానీ నేను మాత్రం పిల్లలతో కాస్త స్ట్రిక్ట్ గానే ఉంటానని చెప్పుకొచ్చింది. తాను షూటింగ్ టైం లో కూడా ఇతర ఆర్టిస్టులతో చాలా సన్నిహితంగా మెలుగుతాడని స్వయంగా మహేష్ తో యాక్టించేసిన రకుల్ ప్రీత్ చెప్పడం విశేషం. ఇలా మహేష్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో తాను ఓ గొప్ప మానవతా వాది అని సినీ ప్రముఖులు ప్రశంశించడం విశేషం.