'బాహుబలి' - 'లోఫర్' బ్యూటీల డ్యాన్స్ వీడియోస్ వైరల్...!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా ప్రపంచాన్ని చుట్టేసే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే లాక్ అయ్యారు. దీంతో రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థం కాని సెలబ్రిటీలు.. క్వారంటైన్ పేరిట తమకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. బోర్ కొడుతుండ‌డంతో కొందరు సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో మరి కొన్ని రోజులు ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరు ఇంకొంచెం డోస్ పెంచారు. ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీస్ దిశ పటానీ, నొరా పాతేహీ తమ డ్యాన్సింగ్ స్కిల్స్ చూపిస్తున్నారు. 

 

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశ పటానీ మన టాలీవుడ్ లో 'లోఫర్' సినిమాతో తన అందాలను రుచి చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లాక్‌ డౌన్ సమయాన్ని దిశా బాగా తెలివిగా వాడుకుంటోంది. డైలీ హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు తన హాబీలను వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఫుల్ జోష్ అందిస్తోంది. క్వారంటైన్ లో దిశా పటానీ తన డ్యాన్స్ తో టాప్ లేపేస్తుంది. డ్యాన్సింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటుందా.. లేదా మరేదైనా చూపించడానికి ట్రై చేస్తుందా అనేంతలా ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ వీడియోను దిశాపటానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేస్తూ.. యోన్స్ బేయోన్స్ ట్రాక్ కు రొటీన్ గా హిప్ హాప్ పెర్మాఫార్మెన్స్ చేశానంటూ కామెంట్ జత చేసింది. దిశా డ్యాన్స్ మామూలుగానే కిర్రెక్కిస్తుంది. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#beyonce❤️ Choreography #brian🌸 #quarantinelife❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

 

మరోవైపు నొరా పాతేహీ.. గల్లీ డ్యాన్స్ స్టైల్స్ తో వీడియో చేసి ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. మాస్ స్టెప్పులతో వేసిన డ్యాన్స్ కు కామెంట్ కూడా పెట్టింది. చివరికి ప్యారిస్ గోబెల్ లైవ్ డ్యాన్స్ క్లాస్ చూసి నేర్చుకున్నా అని పోస్టు చేసింది. ఈమెను గుర్తు పట్టే ఉంటారు. బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ లో నటించింది. సత్యమేవ జయతే సినిమాలో దిల్ బర్ కు, బట్లా హౌజ్ మూవీలో ఓ సఖీ సఖీ పాటకు, మర్జావన్ లో ఏక్ తో కామ్ జిందగానీ, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీలో గర్మీ పాటల్లో డ్యాన్స్ లు వేసి ఈలలు కొట్టించింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Finally learnt @parrisgoebel live {{RelevantDataTitle}}