బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత వివాదాస్పద నటో.. ఆమె చెల్లెలు రంగోలి చండల్ అంతకన్న ఎక్కువ వివాదాస్పద వ్యక్తి. ప్రతీ వివాదంలోనూ కంగనా తరపున వకాల్తా తీసుకొని రెచ్చిపోయే ఈ భామ ఎంతో మంది సినీ తారలపై ప్రత్యక్షంగానే విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై పలువురు సినీ ప్రముఖులు ట్విటర్‌కు, ముంబై పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ట్విటర్ కఠిన నిర్ణయం తీసుకుంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుందన్న కారణంతో ఆమె ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. అయితే ఆమె ట్విటర్ ఎకౌంట్ ను సస్పెండ్ చేయటంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫరా ఖాన్ స్పందిస్తూ ` ఈ ట్విటర్ ఎకౌంట్ ను తొలగించినందుకు ట్విటర్‌కు కృతజ్ఞతలు. ఇప్పటికే నేను ఆమె తన ఎకౌంట్ ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుందని నేను కంప్లయింట్ ఇచ్చాను` అంటూ చెప్పింది.
ఈ ఘటనపై నటి కుబ్రా సైత్ కూడా స్పందించింది. నేను రంగోలి ట్విటర్ అకౌంట్ ను బ్లాక్ చేయటంతో పాటు పోలీసులకు కూడా కంప్లయింట్ ఇచ్చాను. ఫేక్ న్యూస్‌తో పాటు విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్న రంగోలి పట్ల కఠిన నిర్ణాయం తీసుకోవాలని కోరినట్టుగా తెలిపింది.
మరింత సమాచారం తెలుసుకోండి: