బన్నీ పుష్పలో విలన్ గా బాలీవుడ్ హీరో..?

Pranateja Sriram

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ విశేష స్పందన వచ్చింది. ఊరమాస్ లుక్ లో బన్నీ కనిపించేసరికి ఫ్యాన్ ఫిదా అయిపోయారు. ఒక్క పోస్టర్ లోనే ఎన్నో డీటైల్స్ చూపించిన సుకుమార్, సినిమాపై ఆసక్తి పెంచేశాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విలన్ గా కనిపించనున్నాడట.


బన్నీకి ఎప్పటి నుండో పాన్ ఇండియా సినిమా తీయాలని కోరికగా ఉంది. అందుకే అల వైకుంఠపురములో ప్రమోషన్స్ టైమ్ లో నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాతో బన్నీ కోరిక నెరవేరనుంది. చిత్తూరు ప్రాంత నేపథ్యంలొ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి సాగే ఈ రివేంజ్ డ్రామాలో లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు. 

 

బన్నీకి ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. హిందీలో బన్నీ డబ్బింగ్ సినిమాలకి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. కానీ ఆ వ్యూస్ అన్నీ కలెక్షన్స్ గా మారతాయా అన్న సందేహం అందరిలో ఉంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నప్పుడు ఆ అప్పీల్ కలిగించడానికి బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని అనుకుంటున్నారట. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ లని విలన్ రోల్ కి తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. 

 

ఇప్పటికే తమిళ ప్రేక్షకుల కోసం విజయ్ సేతుపతి ఉన్నాడు. విజయ్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. మరి విలన్ గా ఏ బాలీవుడ్ నటుడిని తీసుకుంటారో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స బ్యానర్ లో తెరకెక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: