అక్కినేని అఖిల్ సినీ ప్రస్థానం ఇలా...!

Suma Kallamadi

 

అక్కినేని కుటుంబంలో పెద్దాయన నాగేశ్వరరావు నుంచి ఇప్పటి తరం అఖిల్ వరకు అందరూ వారి నటనలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టినవారే. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు వారి నటన ప్రభావాలతో అనేక అవార్డుని కొల్లగొట్టారు. ఇక తర్వాతి తరంలో తనయుడు నాగార్జున నూటికి నూరు శాతం తండ్రిని నటనలో ఫాలో అయ్యాడు. నాగార్జున కి తెలుగు ప్రజానికిరం లో కొండంత ప్రేక్షక ఆదరణ ఉంది. ఈయనకి నటనకు మెచ్చి అనేకమార్లు నంది అవార్డుని గెలుచుకున్నారు.  

 


ఇక ప్రస్తుత తరం అక్కనేని కుటుంబం నుంచి నాగ చైతన్య, అఖిల్ వీరిద్దరూ అన్నదమ్ములు సీమంచి సిన్మాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అక్కినేని వారసుడు అఖిల్ తన చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సిసింద్రీ సినిమా అంటే చిన్న పిల్లలకి ఎందుకో చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత అఖిల్ "మనం" సినిమా చివరిలో కనిపించాడు. తన పదహారేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ అడుగు పెట్టాడు. ఇక అఖిల్ మొదటి సినిమా 2015 లో వివి వినాయక్ దర్శకత్వంలో "అఖిల్" అని టైటిల్ తో సినిమా తీశాడు. ఆ తర్వాత 2016లో "ఆటాడుకుందాం రా" అనే సినిమాలో అతిథి పాత్ర చేశాడు. ఇక 2017 లో "హలో" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 2019లో " మిస్టర్ మజ్ను" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బ్లాస్టర్ ని అందుకున్నాడు.

 

 


ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్" అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకి అల్లు అరవింద్, వాసు వర్మ ప్రొడ్యూసర్ గా వ్యవహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. అందుకు మంచి ఆదరణ కూడా లభించింది. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు మిస్టర్ మజ్ను ఒక్క సినిమానే హిట్ టాక్ వచ్చింది అఖిల్ కి. నిజానికి ఇప్పుడు ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ, అభిమానులు గంపెడు ఆశలు చాలా పెట్టుకున్నారు. అయితే ఇక ఆ కరోనా తగ్గాక ఈ సినిమా ఎంత వరకు హిట్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: