పవన్‌, రజనీలకు షాక్ ఇచ్చిన ట్విట్టర్‌!

JSR
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 14 గంటల పాటు కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుతో ఒక్క తాటి మీదకు వచ్చిన దేశ ప్రజలు కర్ఫ్యూలో భాగం పంచుకున్నారు. ఎవరికి వారు స్యయంగా ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దేశ కోసం ప్రజలంతా స్వయం నియంత్రణ పాటించాలని కోరుతూ సందేశాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులకు జనసేన కార్యకర్తలకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపు నిచ్చాడు. కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజనీ కాంత్ కూడా తన అభిమానులకు ఇదే సందేశాన్ని ఇచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో వారు వైరస్‌ 12 గంటల మాత్రమే జీవిస్తుందని, ఆ తరువాత చనిపోతుందని చెప్పారు పవన్‌, రజనీ. దీంతో ట్వీటర్ వారి ట్వీట్‌లపై చర్యలు తీసుకుంది.

ఫేక్‌ న్యూస్‌ను కట్టడి చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌ ను కోరిన నేపథ్యంలో వారు పవన్‌, రజనీల ట్వీట్‌ లను తొలగించారు. కరోనా వేరస్‌ కేవలం 12 గంటలు మాత్రమే జీవిస్తుందన్న వార్తల్లో నిజం లేనందున్న ఆ విషయాన్ని ప్రస్థావించిన పవన్, రజనీల ట్వీట్‌ లను ట్విటర్ తొలగించింది. అయితే సోషల్ మీడియా జనత కర్ఫ్యూకు పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: