స్టార్ హీరోయిన్ కి కరోనా వైరస్... బ్రేక్ అప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్

Suma Kallamadi

ప్రపంచమంతటా గడగడలాడిస్తున్న కరోనా పై తాజాగా హీరోయిన్ ఓల్గా స్పందిస్తుంది. ఇందులో భాగంగా తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ లో తనకి కరోనా వైరస్ సోకినట్లు తెలిపింది.

 

గత ఏడు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవలే వైద్యుల్ని సంప్రదించగా కరోనా వైరస్ సోదికినట్లు తెలిపారని చెప్పుకొచ్చింది. అంతేగాక మీరు కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తన అభిమానులకు సూచించింది.

 

ఈ విషయం తెలుసుకున్నటువంటి ఓల్గా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అంతేగాక మరికొందరైతే ఆమె తొందరగా ఈ వైరస్ బారి నుంచి కోలుకోవాలని ఆ దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల దేశంలోని పలు చిత్రాల విడుదల, చిత్రీకరణ కూడా వాయిదా వేశారు. దీంతో ఈ కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై మాత్రం బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

 

ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీనిపై ఓల్గా స్వయంగా తన అనుభవాన్ని చెబుతూ అభిమానులు ప్రజలకు పలు సూచనలు చేయడం విశేషం. నాకు వైద్యులు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

అంతా అయిపోయాక కేవలం జ్వరం పెరిగినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమని వైద్యులు చెప్పారు. అంతేకాదు ఇంటికి వెళ్ళి ఒంటరిగా గదిలో ఉండాలని సూచించారు. అలానే నేను మా ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నా. కానీ కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని తెలిపింది. ఇదంతా సరే కానీ .. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలగానే బోయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా తనతో బ్రేకప్ చెప్పేశాడన్న ప్రచారం ఊపందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: