సింగీతం బయోపిక్ కోసం అనుష్క తో రాయబారాలు !

Seetha Sailaja

క్రియేటివ్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కు 78 సంవత్సరాల వయసు. ఇలాంటి వయసులో ఆయన చలాకీగా ఉండటమే కాకుండా ఇప్పుడు ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయడం దక్షిణ భారత సినిమారంగంలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి బాలకృష్ణతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ తీయాలని ఈ క్రియేటివ్ దర్శకుడు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. 


అయితే బాలయ్య నుండి పూర్తి స్పందన రాకపోవడంతో ఇప్పుడు తానే నిర్మాతగా దర్శకుడుగా మారి ఒక భారీ బయోపిక్ మూవీకి సింగీతం ఇప్పుడు శ్రీకారం చుట్టారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సింగీతం తీయబోతున్న మూవీ బెంగుళూరు ప్రాంతానికి చెందిన నాగరత్నమ్మ అనే ప్రముఖ కళాకారిణి బయోపిక్ అని తెలుస్తోంది. మైసూర్ లో పుట్టిన నాగరత్నమ్మ జీవితంలో అనేక సినిమా కథకు మించిన ట్విస్ట్ లు ఉన్నాయి. 


దేవదాసి కుటుంబంలో పుట్టిన సంగీత కళాకారిణి నాగరత్నమ్మ. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణిగా ఎంతో పేరు గాంచిన ఆమె చివరిదశలో యోగిని గా మారింది. ఆమె మంచి కవితలు కూడ వ్రాసింది. ఆమె జీవితంలో సంపాదించిన తన సంపాదన అంతా కళలకు సంస్కృతి ఉద్యమాలకు ఖర్చు పెట్టింది. ఆమెకు  త్యాగ‌రాజ స్వామి అంటే ఆరాధ‌న భావం ఎక్కువ‌. 

 

అందుకే తిరువయ్యూరులో ఉన్న త్యాగ‌రాజు స‌మాధి శిధిలావ‌స్థ‌కు చేరుకున్న‌ప్పుడు తన సొంత డ‌బ్బుతో మ‌ర‌మ‌త్తులు చేయించి  ఆ ప్ర‌దేశాన్ని ఓ అంద‌మైన ఉద్యాన‌వ‌నంగా ప్రభుత్వం సహాయం లేకుండా అంతా తన సొంత డబ్బు ఖర్చు పెట్టింది. ఇక్కడే ప్ర‌తీ యేటా త్యాగ‌రాజ స‌మారాధ‌నోత్స‌వాలు జ‌రుగుతుంటాయి. నాగ‌ర‌త్న‌మ్మ ఆ స‌మాధిముందే ప్రాణాల్ని కోల్పోయింది అని అంటారు. ఇప్పుడు ఈ క‌థ‌నే ఇప్పుడు సింగీతం సినిమాగా తీస్తున్నారు. ఈ బయోపిక్ లో నాగరత్నమ్మ పాత్రను పోషించవలసిందిగా సింగీతం అనుష్కను కోరుతున్నా శాస్త్రీయ నృత్యంలో శాస్త్రీయ సంగీతంలో తనకు ఏమాత్రం అవగాహన లేని పరిస్థితులలో తాను ఎంతవరకు నాగరత్నమ్మ పాత్రకు సరిపోతాను అన్న కన్ఫ్యూజన్ లో అనుష్క ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: