కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రష్మి గౌతమ్..!

Suma Kallamadi

నేతలు అనే వారు చాలా సమర్థవంతులు అలాగే వారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంటుంది. నేతలు ఏం చెప్తే అది ప్రజలు గుడ్డిగా ఫాలో అవుతారు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు ఆలోచించుకుని చెప్పాలి అంటూ రష్మీ గౌతమ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఉద్దేశిస్తూ ఈరోజు చాలా ట్వీట్స్ చేసింది. 

 

మరొక ట్వీట్లో... 'రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ నయం చేయడానికి పారాసిటమాల్ వాడమని చెప్పే బదులు... ఇంకా కాస్త ఆలోచించి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి ప్రజలలో అవహగాన కల్పించాల్సింది . వైరస్ ని చిన్న చూపు చూస్తే ప్రజలకు అది ప్రాణాంతకంగా మారుతుంది. మొదటిలో ఇటలీ అమెరికా వైరస్ గురించి సరిగా జాగ్రత్తలు తీసుకోలేదు అందుకే ఇప్పుడు ఆ దేశాలు అనేక అవస్థలు పడుతున్నాయి. ప్రజల్ని వైరస్ ఎంత ప్రాణాంతకం తెలుసుకొనివ్వండి', అని పేర్కొంది. 

 

 

అసలు ఈ పరిస్థితిలో పాటించవలసినవి ఏంటంటే... పరిశుభ్రంగా ఉండటం. అందుకుగాను బ్లీచింగ్ పౌడర్ వాడి మీ పరిసరాలను శుభ్రపరచుకోండి. ఒకవేళ మీకు గనక జ్వరం వస్తే ఒక పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకొని తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వీలైతే ఇతరులకు దూరంగా ఉండండి', అని తన ఇంకొక ట్వీట్ లో పేర్కొంది. 

 

 


మరోవైపు రష్మి గౌతమ్ ట్వీట్లకు నెటిజనులు స్పందిస్తూ... ముందు తెలుగు సక్రంగా నేర్చుకో. నువ్వేమి ఎంబిబిఎస్ డాక్టర్ కాదు. ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా నీకు ఏమీ తెలియదు. వాళ్లు మాట్లాడే ముందు తమ డాక్టర్లు, సెక్రటేరియట్లను సంప్రదించకుండానే మాట్లాడతారు అనుకుంటున్నావా? నువ్వు ట్విట్టర్లో చెప్పేవేవో నాగబాబు, డైపర్ ఆది, సుధీర్ ముందు చెప్పుకో' అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రష్మి గౌతమ్ మాత్రం వీటన్నిటినీ పట్టించుకోకుండా తన చెప్పాల్సింది తాను చెప్పేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: