హ్యాపీ సండే 15-MAR: ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్‌లో బిగ్ కాంట్ర‌వ‌ర్సీలివే...!

Suma Kallamadi

ఈ వారం జబర్దస్త్ షో మీద ఒక మహిళా నేత భగ్గుమన్నారు. జబర్దస్త్ స్కిట్లలో ఆడవాళ్లను కించపరిచే లాగా కమెడియన్లు ప్రవరిస్తున్నారని ఆ షో ని కచ్చితంగా నిలిపివేస్తామని సవాల్ విసిరారు. ట్రాన్స్ జెండర్లను కూడా చాలా చులకనగా ట్రీట్ చేస్తున్నారని ఆమె అన్నారు.



వివరాలు తెలుసుకుంటే... హైపర్ ఆది స్కిట్ లో కనిపించే దొరబాబు, ఇంకో జబర్దస్త్ కమెడియన్ పరదేశి వ్యభిచార గృహాల్లో పట్టుబడ్డారు అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సంఘటన జబర్దస్త్ ప్రోగ్రామ్ మీద చాలా ప్రభావం చూపుతుంది. జబర్దస్త్ కమెడియన్లు అంతా ఇదే టైపు, జబర్దస్త్ కూడా పచ్చి బూతు షో అనే డిబేట్ కి కారణమయ్యింది ఈ ఘటన. మహిళా నేతలు కూడా ఆ షో ని నిలిపివేయాలంటూ మీడియా ఇంటర్వ్యూలలో డిమాండ్ చేసారు.




ముఖ్యంగా మహిళ నేత కృష్ణకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... 'జబర్దస్త్ ప్రోగ్రాం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ప్రోగ్రాం లో ఆడవాళ్ళ పై వేసే జోకులు, కామెంట్లు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఏంటి ఈ బూతులు అని ఆ షో నిర్వాహకులను అడిగితే వారు ఏవో కారణాలు చెప్పి పంపించేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ని స్టాప్ చేయడం చాలా సులువు. చాలా సీట్లలో బూతు పదాలన్నిటిని సేకరించి వాటిని మహిళా కమిషన్ ముందు సమర్పిస్తే ఈ ప్రాగ్రాం ని ఆపవచ్చు. కూలి పనులు చేసుకొనే వారు కూడా జబర్దస్త్ షో చూస్తున్నారు. ఆడవారి గౌరవం మంటగలిపే ఈ షో ని వాళ్ళు చూడడం వలన తమ ఆడవారిని గౌరవిస్తారా? మేము ఖచ్చితంగా జబర్దస్త్ షో పై పోరాటం చేసి దానిని ఆపేస్తాము', అని ఆమె సవాల్ విసిరారు. మరి మహిళా నేత కృష్ణకుమారి ఏ విధంగా కృషి చేస్తారో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: