పవన్ తో అలాంటి మూవీనే తీస్తాడట..

Edari Rama Krishna

తెలుగు ఇండస్ట్రీలో హరీష్ శంకర్ చిత్రాలంలో ఓ ప్రత్యేకత ఉంటుంది.  కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు హీరోయిజానికి పెద్ద పీట వేస్తుంటారు.  గతంలో ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ లో హీరోయిజం అంటే ఏంటో చూపించాడు.  ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ క్రేజ్ ఓ రేంజ్ లో వెళ్లిపోయింది.   మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాాలు తీయడంలో ఈ దర్శకుడు ప్రత్యేకత చాటుకున్నాడు.  గత ఏడాది వరుణ్ తేజ్ తో ‘గద్దల కొండ గణేష్’ లాంటి చిత్రంతో నెగిటీవ్ షేడ్స్ తో పాటు హీరోయిజం చూపించాడు.  అంతే కాదు ఈ చిత్రంలో వరుణ్ తేజ్ లుక్ పరంగా కూడా గంభీరంగా చూపించి మంచి హిట్ అందుకున్నాడు హరీష్ శంకర్. 

 

ప్రస్తుతం పవన్ కళ్యాన్ రాజకీయాల్లో కొనసాగుతూనే వెండి తెరపై తన సత్తా చూపించడానికి రెడీ అయ్యారు.  వరుస చిత్రాలతో దుమ్ముదుళిపేందుకు సిద్దమయ్యారు.  బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.  తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడికల్ చిత్రంలో నటించబోతున్నారు. 

 

ఆ తర్వాత మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మద్య ఈ దర్శకుడికి ఫ్యాన్స్ నుంచి ఓ రిక్వెస్ట్ వచ్చిందట.. ప్రస్తుతం పవన్ కళ్యాన్ వెండితెరపై హీరోనే కాదు రాజకీయాల్లో ప్రజల మద్య ఉన్న ఓ నాయకుడు.. అందుకు ఆయన గౌరవానికి తగ్గ చిత్రాలు తీయాలని దాని సారాంశం.  ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సామజికకోణంలో ఉండే చిత్రానికే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు హరీష్ శంకర్ లైక్ సింబల్ తో ఒకే చెప్పేశాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: