చిరంజీవి సంస్కారం గురించి రెజీనా బయటపెట్టిన షాకింగ్ న్యూస్ !
మెగా హీరోయిన్ గా మెగా అభిమానులలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన రెజీనా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈమధ్యనే స్పెషల్ సాంగ్ షూటింగ్ ను దాదాపు 6 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి భారీ లైటింగ్ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్లో చిత్రీకరించారు.
ఈ ఐటమ్ సాంగ్ వివరాలను తెలియచేస్తూ రెజీనా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి సంస్కారం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా రాత్రి సమయంలో జరగడంతో 64 సంవత్సరాల వయసు ఉన్న చిరంజీవి అలసిపోతాడేమో అని తాను భావించానని అయితే అర్దరాత్రి సమయం దాటిపోయినా చిరంజీవి మొఖంలో తాను ఎప్పుడు అలసట చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది.
అంతేకాదు ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ లు వచ్చినప్పుడు చిరంజీవిని తన కేరవాన్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పినా వెళ్ళకుండా ఈ సాంగ్ లో తాను ఎలా నటించాలో అనేక సలహాలు తనకు ఇవ్వడమే కాకుండా ఈ సాంగ్ లో నటిస్తున్న అనేకమంది ఎక్స్ ట్రా ఆర్టిస్టులకు కూడ చిరంజీవి నవ్వుతూ సలహాలు ఇవ్వడం చూసి తన మైండ్ బ్లాంక్ అయిన విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా తాను డాన్స్ స్టెప్పుల విషయంలో భయపడనని అయితే చిరంజీవి డాన్స్ స్పీడ్ తో తాను సరిసమానంగా డాన్స్ చేయడానికి తాను ఎంతో శ్రమ పడవలసిన విషయాన్ని బయటపెట్టింది.
అంతేకాదు ఈ సాంగ్ ట్యూన్ కూడ చాల క్రేజీ గా ఉంటుంది అని చెపుతూ మణి శర్మ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ట్రెండ్ సెటర్ గా మారుతుంది అంటూ రెజీనా అంచనాలు పెంచేస్తోంది. మెగా స్టార్ హోదాను అనుభవించే చిరంజీవికి ఏమాత్రం గర్వం లేదని చెపుతూ కొత్త వారిని ప్రోత్సహించడంలో చిరంజీవి తీసుకునే శ్రద్ధను చూస్తే ఆయన సంస్కారం గురించి చెప్పడానికి తనవద్ద మాటలు లేవు అని అంటోంది..