తుషార్ కపూర్ ఇలా చేస్తాడనుకొలేదు : ఏక్తా కపూర్

Suma Kallamadi

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్.. ఈమె బాలీవుడ్ లో పరిచయం లేని వ్యక్తి. అప్పట్లో ఈమె పెళ్లి కాకుండానే మాతృత్వాన్ని పొందడం చర్చంశనీయమైంది. అయితే.. ఈమె బాలీవుడ్ లో తొలుత టెలివిజన్ రంగంలో సత్తా చాటింది. ఆమె రూపొందించిన ఘర్ ఏక్ మందిర్ మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఖ్యోంకి సాస్ బీ కభీ బహూ థీ, కహానీ ఘర్ ఘర్ కీ లాంటి సీరియల్స్ అత్యంత ప్రజాదరణను చూరగొన్నాయి. కాగా., పెళ్లికాకుండా మాతృత్వ మధురానుభూతిని పొందుతున్న ఏక్తా కపూర్ ఆ అనుభవాన్ని, సంతోషాన్ని పంచుకున్నారు.

 

 

అనంతరం ఆమె సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి పలు చిత్రాలను తెరకెక్కించారు. కేవలం ఏక్తాకపూర్ కాకుండా తన సోదరుడు తుషార్ కపూర్ అద్దె గర్బం ద్వారా తండ్రి కావడం మరెందరికో స్ఫూర్తిని ఇచ్చింది. అలానే వారు పలు విమర్శలను కూడా ఎదుర్కున్నారు.

 

 

ఆమె పెళ్లి కాకుండా మాతృత్వాన్ని ఎందుకు పొందలనుకున్నారనే విషయాన్ని ఆమె వెల్లడించింది. ఆమెను పెళ్లి చేసుకోమని ఆమె తల్లిదండ్రులు వత్తిడి తెచ్చేవారట. వాళ్ల పోరు తట్టుకోలేక పోయాను. అలా అని ఒకరి కోసం నేను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే నేను సింగిల్ పేరెంట్‌ గా కావాలని చాలా రోజుల క్రితం నుంచే అనుకొంటున్నాను. నా వయసు 36 ఏళ్లు ఉన్నప్పుడే నా అండాలను భద్రపరుచుకొన్నానని ఆమె వెల్లడించారు. ఆ ముందు చూపుతోనే నేను తల్లిని అయ్యానని ఏక్తా కపూర్ చెప్పుకొచ్చింది.

 

 

తన తమ్ముడు కూడా సింగిల్ పేరెంట్ గా ఉండాలనుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆమె తెలిపారు. అసలు ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందు తుషార్ కపూర్ మమ్మల్ని ఎవ్వర్ని సంప్రదించలేదని ఆమె అన్నారు. అత్తామామలు లేకుండా పిల్లలకు తల్లివని, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివని నా స్నేహితులు ఆటపట్టిస్తుంటారని ఏక్తా  తెలిపారు. ఎవరు ఏమనుకొంటుందనే విషయాన్ని ఎప్పుడో గాలికి వదిలేశారని, అసలు పట్టించుకోనని ఏక్తా కపూర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: