హెరాల్డ్ విజేత: మహానటి సావిత్రి మధుర సన్నివేశాలు

Suma Kallamadi

సావిత్రి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్న గొప్ప నటి. కేవలం తెలుగు చిత్రాలలో మాత్రమే కాక తమిళ సినిమాలలో కూడా సావిత్రి నటించింది. నటిగా, దర్శకురాలిగా ఎంతో అభిమానాన్ని సంపాదించింది. చిన్నతనంలో ఆమె తన తండ్రిని పోగుట్టుకుంది. ఆ తర్వాత తన పెద్ద నాన్న సావిత్రిని పెంచాడు. ఆమెకి చిన్నతనం నుండి నాటకాలపై ఆసక్తి ఎక్కువ. నాటకాల నుండి తన కళని పెంచుకుంటూ ఆమె సినిమాలో నటించడం మొదలు పెట్టింది. నాటకాలుచేస్తున్నప్పుడు హిందీ నటుడు పృథ్వి రాజకపూర్ చేతుల మీదుగా ఆమె బహుమతి అందుకుంది. మొదట చిన్న పాత్రలతో మొదలుపెట్టి అగ్ర నటి స్థానానికి చేరుకుంది సావిత్రి.  

 

 

తన పెద్దనాన్న సాయంతో సినిమాల వైపు దృష్టి పెట్టింది ఈ నటి. ఆ తర్వాత తిరుగులేని అభినేత్రిగా ఎదిగింది ఈ మహానటి. అచ్చం మహానటి సినిమాలో చూసినట్టే ఈమె జీవితం. ఈమె అభినయానికి ఎవరైనా ముగ్ధులు అవ్వక తప్పదు. మొదట సావిత్రి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత పాతాళ భైరవిలో కూడా చిన్న పాత్ర చేసింది. కానీ పెళ్ళి చేసి చూడు సినిమాతో ఓ మలుపు తిరిగింది తన కెరియర్లో. 

 

 

సంసారం, అగ్నిపరీక్ష, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, పల్లెటూరు, ప్రతిజ్ఞ, దేవదాసు, బ్రతు తెరువు, మేనరికం, చంద్రహారం, పరివర్తన, భలే అమ్మాయిలు, మాయాబజార్, విమల ఇలా అనేక సినిమాలలో సావిత్రి నటించింది. అలానే చిన్నారి పాపలు, కుళందై ఉళ్ళం, మాతృదేవత, చిరంజీవి, వింత సంసారం, ప్రాప్తం వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. నవరాత్రి సినిమాలో ఈమె నేపధ్య గాయని. 

 

 

మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ 2018 లో అశ్విన్ నాగ్ తమిళ్, తెలుగులో ఈ సినిమాని రూపొందించాడు ఆ విషయం తెలిసినదే. ఈ చిత్రానికి అశేష జనాదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: