వాళ్ళందరూ అలా చేసారు.. నేను మాత్రం ఇంకా అలా చేయలేదు.. నటి హేమ సంచలనం..?

praveen

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఎంతో మంది హీరోయిన్లు ఉన్నట్లుగానే ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వివిధ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడూ మీడియా ముందు  కనిపిస్తూ... ఉండే వారిలో ముందుగా గుర్తొచ్చేది నటి హేమ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి నటిగా ప్రస్థానం కొనసాగిస్తున్న హేమ కేవలం సినిమాల ద్వారా నే కాదు పలు వివాదాలు ద్వారా కూడా తెరమీద కనిపిస్తూనే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాల్లో కూడా ఎక్కువగా హేమ తెరమీద కనిపిస్తూ ఉంటుంది. 

 

 

 ఇక సినిమాల విషయానికొస్తే ఎంతోమంది హీరోయిన్ లకు  తల్లి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది నటి హేమ. అంతే కాకుండా సినిమాల్లో ఎన్నో కీలక పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. ఇక తన నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులను సైతం అందుకుంది హేమ. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కమెడియన్ పాత్రను కూడా పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు ఎనర్జీతో వుండే హేమ వివాదాలతో కూడా ఎన్నోసార్లు తెరమీద కనిపించనుంది. అయితే ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 

 

 

 ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరిని నమ్మొద్దూ  అని అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని తాను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన వారు  చెప్పేవారు అంటూ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపింది హేమ. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో మందు తాగడం అనేది సర్వసాధారణమైన విషయం.. నా విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకు మందు తాగే అలవాటు మాత్రం లేదు అంటూ తెలిపింది. నా స్నేహితులకు చాలామందికి మందు తాగే అలవాటు ఉంది అని కానీ నాకు మాత్రం ఇప్పటివరకు అలాంటి అలవాటు ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది నటి హేమ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: