ఈ పాత్ర చెయ్యాలంటే తన తరవాతే ఎవరైనా....

Suma Kallamadi

మంచి పాత్రలతో ఎన్నో సినిమాల్లో నటించాడు ఈ హాస్య నటుడు. మొదట భీమవరం లో తెలుగు టీచరుగా పని చేసాడు. ఆ తర్వాత హీరో కృష్ణం రాజు, శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్ళితో పరిచయం అయ్యాడు. కొన్ని రోజులు సినీ స్టోరీ రచయతగా కూడ పని చేసాడు ఎం.స్.నారాయణ. అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ. నిడమర్రు లో పుట్టారు. తండ్రి రైతుగా ఉంటూ చదివించాడు. అలానే పైకి వచ్చాడు ఎం.స్.నారాయణ. 

 

 

2003 లో విడుదల అయినా శివమణి సినిమాకి ఉత్తమ హాస్య నటుడి అవార్డు వచ్చింది ఎం.స్.నారాయణకి.  2011 లో కూడ ఉత్తమ హాస్య నటుడి అవార్డును లభించింది దూకుడు సినిమాతో .

 

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో "ఏం చేస్తున్నావ్... ఏం చేస్తున్నావ్ అని మాటి మాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను "అన్న సంభాషణకి పేరు పడిపోయాడు. అలానే నువ్వు నాకు నచ్చావ్  సినిమాలో "అమ్మా...నీ కళ్ళేవి?" అన్న దానికి కూడా పేరు పడిపోయాడు. శివమణిలో "షేక్ ఇమామ్" అనడం కూడా పేరు తెచ్చింది.

 

 

"సోడా కొట్టడం అంటే పీ.జి పాసైనంత వీజీ కాదు" అని బన్నీ సినిమాలో అంటాడు. దానికి కూడా పేరు పడిపోయాడు ఎం.స్.నారాయణ. అతడు సినిమాలో ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి అంటాడు ఇది కూడా ఎంతో ఫేమస్ అయ్యిపోయింది.


బాటిల్ పట్టుకుని ఊగడం మొదలు పెడితే ఎం.స్ తర్వాతే ఎవరైనా. మొత్తం 200 చిత్రాల్లో తాగుబోతు క్యారెక్టర్లో చేసాడు. ఇలా తాగుబోతు వాడిగా అనేక పాత్రలు చేసి ఎంటర్టైన్ చీసాడు ఎం.స్. పేరడీ పాత్రలకి  కూడ ఎం.స్ తర్వాతే ఎవరైనా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: