అక్కినేని అన్న‌ద‌మ్ముల క‌ష్టాలు.. త్యాగాలు... పాపం..?

Arshu
అక్కినేని యంగ్ హీరోలైన అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో దూసుకెళుతుంటే త‌మ్ముడు అక్కినేని అఖిల్ మాత్రం ఒకే ఒక్క హిట్ ఎప్పుడు వ‌స్తుందా ? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ అన్న‌ద‌మ్ముల్లో చైతు హ్యాట్రిక్ హిట్ కోసం శేఖర్ కమ్ములతో కలిసి ‘లవ్ స్టోరీ’ చేస్తుంటే, అక్కినేని అఖిల్ తన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఇద్దరూ సమ్మర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు స‌రైన రిలీజ్ డేట్ లేకుండా పోయింది.

ఇక ముందుగా నాగ చైత‌న్య లవ్ స్టోరీ ని మొదటగా ఏప్రిల్ 2న అనుకున్నారు. మ‌ళ్లీ స‌డెన్‌గా ఏమైందో ఏమోగాని దీని రిలీజ్ మే 22కు మార్చారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాను జూలైకు వాయిదా వేసిన‌ట్టు టాక్‌.. ?   చైతూ వెనక్కి వెళ్లడంతో అన్నయ్య రావాల్సిన డేట్ కి అఖిల్ వద్దామని ఫిక్స్ అయ్యాడు. అందుకే సమ్మర్ హాలిడేస్ క్యాష్ చేసుకోవాల‌ని అఖిల్ త‌న సినిమాను మే 22న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఈ లెక్క‌న చూస్తే ఈ యేడాదిలో ముందుగా అఖిల్ త‌న ల‌క్ చెక్ చేసుకున్న‌ట్లు అవుతుంది. ఈ సినిమాతో అయినా అఖిల్‌కు హిట్ రాక‌పోతే అఖిల్ కెరీర్ తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డిపోవ‌డంతో పాటు అత‌డు పూర్తిగా డైల‌మాలోకి వెళ్లిపోతాడు. మూడు వ‌రుస ప్లాపుల‌తో అఖిల్ సినిమా వ‌స్తుందంటే అంచ‌నాలు కూడా ఉండ‌డం లేదు. మ‌రి ఈ సినిమాతో అయినా అఖిల్ కెరీర్‌లో ఫ‌స్ట్ హిట్ కొడ‌తాడేమో ?  చూడాలి.

ఇక అన్న‌ద‌మ్ముల పాట్లు ఇల ఉంటే మధ్యలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మ‌రి ఈ యేడాది అయినా ఈ తండ్రి, కొడుకులు త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారో ?   లేదో ?   చూడాలి. ఉన్నంత‌లో చైతు రెండు హిట్ల‌తో బెట‌ర్‌. అటు అఖిల్ , నాగ్ ఇద్ద‌రు వ‌రుస ప్లాపుల‌తో హిట్ కోసం మొహం వాచి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: