బాలయ్య విలన్‌తో బాలయ్య హీరోయిన్ ఎఫైర్ .. అందుకే మూడు సినిమాల్లో ఛాన్సులు..!
నందమూరి బాలకృష్ణ.. పరిచడం అక్కర్లేని పేరు. అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనే బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినిమా హీరో మరియు నిర్మాత. యువరత్న బాలకృష్ణగా ప్రసిద్ధిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేసి ప్రేక్షకులను వీపరీతంగా అకట్టుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందకు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు బాలయ్య. అయితే రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈయన వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అయితే అలాంటి సమయంలో చేసిన ఓ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి ఓ నటుడు విలన్‌గా సరికొత్త అవతారంతో వచ్చాడు. అంతేకాకుండా, ఈ సినిమాలో హీరో మరియు విలన్‌గా మారిన సదరు నటుడు పోటా పోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ విలన్‌కు మరియు బాలయ్య ఓ ఫ్లాప్ సినిమాలో నటించిన హీరోయిన్‌కు ఎఫైర్ ఉన్నట్టు తెగ ప్రచారం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే సదరు విలన్ మరియు బాలయ్య హీరోయిన్ వరసగా మూడు సినిమాలు నటించడంతో ఈ ప్రచారం మరింత పుంజుకుంది.
మరో విషయం ఏంటంటే.. సదరు హీరోయిన్ ఈ విలన్ సినిమా ద్వారానే తెలుగువారికి మరింత పరిచయమైంది. ఆ వెంటనే ఈ హీరోయిన్‌కు ఒకటో, రెండో మంచి హిట్లు పడ్డాయి. ఇక ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడం.. కొత్త హీరోయిన్స్ నుండి పోటీ కారణంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక సదరు విలన్ టాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలిగి, ఇప్పటి జనరేషన్ హీరోల పోటీ తట్టుకోలేక, ఇటీవలి కాలంలో విలనీ పాత్రలలో రాణిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈయన కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో సదరు హీరోయిన్‌తో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టారు. అప్పట్లో ఇది పెద్ద కాంట్రవర్సీగా కూడా నిలిచింది.