రేసు గుర్రానికి షాకింగ్ రూమర్స్ !

Seetha Sailaja
రేసు గుర్రానికి షాకింగ్ రూమర్స్ ! ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న కొత్త సినిమా 'రేసుగుర్రం'. బన్నీ ఈ సినిమాను ఏదోవిధంగా సూపర్ హిట్ చేయాలన్న పట్టుదలతో సురేంద్ర రెడ్డి తో కలిసి ‘రేసుగుర్రం’ లాగే పరిగెడుతూ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. బన్నీసరసన శృతిహాసన్ నటిస్తోంది.  అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ ఎదురు చూసారు. కానీ 'ఎవడు' రావడంతో ఇప్పుడు సమ్మర్ కానుకగా విడుదల చేస్తారని ఊహిస్తున్నారు. అయితే ఎపిహెరాల్డ్ కు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్‌లో వస్తుందా, రాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి రావడమె.  ఈ సినిమా సమ్మర్‌లో కూడా రాకపోవచ్చని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 'రేసుగుర్రం' స్టోరీ నాగచైతన్య 'తడాఖా' మూవీని పోలివుంటుందని అనే వార్తలు వస్తున్నాయి. అలా విడుదల చేస్తే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాదని యూనిట్ వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులోభాగంగానే స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు చేసి మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.  మరి ఇందులో నిజమెంతో తెలియక పోయినా ‘గుర్రం’ ఇప్పటి వరకు పరిగెట్ట లేకపోవడానికి కారణం ఇదే అంటున్నారు. అందుకే ఆలస్యం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రానున్న కాలంలో బన్నీ గుర్రం పై ఇంకా ఎన్ని లేటెస్ట్ న్యూస్ లు వస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: