ఆ డేరింగ్ స్టెప్ తోనే స్టార్ హీరోయిన్ అయిందట..!

NAGARJUNA NAKKA

సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలగాలంటే ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలవాలి. మరెన్నో డేరింగ్ డెసిషన్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఎమోషన్స్ ని రిలేషన్స్ కూడా వదులుకోవాల్సి వస్తోంది. రాశిఖన్నా తీసుకున్న అలాంటి డేరింగ్ స్టెప్పే ఇప్పుడు ఆ బ్యూటీని స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిందట. ఈ బ్యూటీ డిప్రెషన్ ను జయించి మరీ  సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయినట్టు తెలుస్తోంది. 

 

సినీ రంగుల ప్రపంచంలో మెరిసిపోవాలని ఎంతో మంది ఆశపడతారు. కానీ కొందరిని మాత్రమే అవకాశాలు వరిస్తాయి. అలా వరించిన ఛాన్స్ ల కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది. అలా సినిమాల కోసం రాశీఖన్నా ఏకంగా ఫ్యామిలీనే శాక్రిఫైజ్ చేయాల్సి వచ్చిందని చెబుతోంది. హీరోయిన్ గా వెలిగిపోవాలనే తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఈ బ్యూటీ పేరెంట్స్ ను వదులు కోవాల్సి వచ్చిందని చెబుతోంది. 

 

రాశీఖన్నా హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఈ బ్యూటీ పేరెంట్స్ నో చెప్పారట. అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో సేఫ్ ఉండదని అడ్డు చెప్పారట. కానీ ఈ బ్యూటీ పేరెంట్స్ మాటలు పట్టించుకోకుండా ఇంట్లో నుండి వచ్చేసి అవకాశాలు పట్టేసినట్టు చెబుతోంది. ఆ టైమ్ లో తల్లిదండ్రులను ఎదురించి వచ్చాననే బాధతో ఈ బ్యూటీని డిప్రెషన్ లోకి వెళ్లిందట. ప్రతీరోజు ఏడ్చేదానినని చెబుతోంది. కానీ కెరీర్ లో ఇలాంటివన్నీ కామన్ అని అర్థమయ్యాక ఈ బ్యూటీ సినిమాలపై ఫోకస్ చేసిందట. 

 

రాశీఖన్నా ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలని చెబుతోంది. పేరెంట్స్ చెప్పగానే ఇంట్లో ఉండిపోయి బాధపడితే హీరోయిన్ అయ్యేదాన్ని కాదని బొద్దుగుమ్మ చెబుతోంది. హీరోయిన్ గా సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రస్తుతం రాశీఖన్నా అమ్మానాన్నలతో సంతోషంగా ఉందట. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ లో రాశీఖన్నా నటించింది. థర్టీప్లస్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పెళ్లి ఆలోచనలు చేస్తోందో లేదో మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: