హీరోయిన్స్ ను ఎత్తుకురావడంలో పూరి స్టైలే వేరు.. రొమాంటిక్ పాప రచ్చ కన్ఫాం..!
ఇన్నేళ్ల తెలుగు సినిమా పరిశ్రమలో తన మార్క్ చూపించే దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఒకరని చెప్పొచ్చు. పూరి సినిమా అంటే టైటిల్ దగ్గర నుండి ఆయన తెచ్చే కొత్త హీరోయిన్ ఒకరు సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. టైటిల్స్ లో తన మార్క్ స్టైల్ చూపించే పూరి కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడగా రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. మాస్ పల్స్ బాగా తెలిసిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు.
ఇక తన నిర్మాణంలో అనీల్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా ఢిల్లీ భామ కెతిక శర్మని తీసుకొచ్చారు. డబ్ స్మాష్ బ్యూటీగా తన హాట్ లుక్స్ తో అందరిని తన వల్లో పడేసుకున్న కెతిక శర్మ సినిమాల్లోకి రాకముందే తన స్కిన్ షోతో రచ్చ రచ్చ చేసింది. ఇక అలాంటి ముద్దుగుమ్మ పూరి చేతుల్లో పడితే ఎలా ఉంటుంది చెప్పండి. రొమాంటిక్ సినిమా కథ ఎలా ఉంటుందో తెలియదు కాని యూత్ ఆడియెన్స్ కు మాత్రం ఈ సినిమా పక్కా ఎక్కేలా ఉంది.
సినిమా పోస్టర్స్, సాంగ్స్ అన్ని కెతిక లోని హాట్నెస్ ను బాగా వాడేసినట్టు ఉన్నారు. కెతిక శర్మ తన లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. కచ్చితమా ఈ అమ్మడు తెలుగులో కొన్నాళ్లు సినిమాలు చేస్తుందని అంటున్నారు. మాములుగా పూరి హీరోయిన్స్ కు ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుంది. మరి పూరి రొమాంటిక్ లో నటిస్తున్న కెతిక శర్మ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. యువతకు నచ్చే మూతి ముద్దులు, హాట్ సీన్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆకాష్ ను హీరోగా నిలబెట్టాలనుకునే పూరి ప్రయత్నం ఈ రొమాంటిక్ తో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.