సమాజాన్ని బాగు చేసే పనిలోనే కొరటాల సినిమాలు..?

praveen

ఆయన టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడు లో ఒకరిగా కొనసాగుతున్నారు... ఏ హీరోతో ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్ గా నిలుస్తోంది... అయితే ఈయన తీసిన సినిమాలు కేవలం సినిమాలకే పరిమితం కాదు... ఎంతో మంది ప్రజలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి... సినిమాలు చూసి వారు కూడా అందులో హీరో ఉన్నట్లుగా మంచి వాడిలా ఉండాలి అని... మంచి పనులు చేయాలి అని అనుకున్న వారు ఎంతోమంది. ఇంతకీ నేను ఏ దర్శకుడి గురించి చెబుతున్నాను  అనుకుంటున్నారా... మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్హిట్ నిలుస్తున్నాయి. దర్శకుడు తెరకెక్కించే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ తప్పకుండా ఉంటుంది. 

 


ముఖ్యంగా కొరటాల శివ సినిమాలో హీరోలందరూ... మంచిని పంచడానికి సమాజాన్ని బాగు చేయడానికి నడుం బిగించి వుంటారు. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల ను తీసుకొని... తనదైనా స్టైల్ లో  తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను  ఎంతో ప్రభావితం చేస్తూ అద్భుత విజయాలను అందుకుంటున్న దర్శకుడు కొరటాల శివ. యంగ్ రెబల్ స్టార్ లాంటి హీరోతో.. ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు... అంటూ పగ మరిచి ప్రతి ఒక్కరికీ ప్రాణం ప్రాణం విలువ తెలిసేలా సినిమాలు తీయాలన్న... ప్రకృతిని కాపాడకపోతే మనుషులకు ఎంతగా ముప్పు వాటిల్లుతుందో తెలియజేయాలి అన్న.. ప్రకృతిని కాపాడేందుకు ఏం చేయాలి అనే దానిపై అందరికీ మెసేజ్ ఇవ్వాలన్న అది కేవలం కొరటాల శివ కే సాధ్యం. 

 


 ఒక బాధ్యతగల పౌరుడు ఒక ఊరిని దత్తత తీసుకొని బాగా చేస్తే ఎలా ఉంటుంది... ఊరి ప్రజలకు అండగా నిలిస్తే ఎలా ఉంటుంది అని ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న... భరత్ అనే నేను లో ఓ చదువుకున్న యువకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ముందుకు సాగుతుంది అని చెప్పాలన్న అది ఒక కొరటాల శివ కే సాధ్యం . కొరటాల శివ తన తెరకెక్కించే ప్రతి సినిమాను మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండేలా చూసుకుంటాడు. కొరటాల శివ తెరకెక్కించే సినిమాలు అన్ని... ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. సమాజాన్ని బాగు చేసే  అనే విధంగా.. మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: