విజ‌య్‌పై బీజేపీ ఐటీ ఎటాక్‌... తెర వెన‌క క‌థ ఇదే...!

praveen

ఈ మధ్యకాలంలో ఇన్కమ్ టాక్స్ సోదాలు  భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇన్కమ్ టాక్స్ అధికారులు సినీ సెలెబ్రిటీలను  ఎక్కువగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే వరుసగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులపై ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  టాలీవుడ్ లో కూడా ఎంతో మంది సినీ ప్రముఖులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు తాజాగా తమిళ ఇండస్ట్రీలో కూడా సినీ  సెలబ్రిటీస్ పై ఐటి సోదాలు జరుగుతున్నాయి . మొన్నటికి మొన్న హీరోయిన్ రష్మిక ఇంటిపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తమిళ స్టార్ విజయ్ కార్యాలయాలు ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం తమిళ స్టార్ హీరో విజయ్ పైనే కాకుండా ప్రొడ్యూసర్ అన్బు చేజియాజ్  పై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 

 

 

 ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ పై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓ సినిమా షూటింగ్లో ఉన్న విజయ్  వద్దకు వచ్చి మరి ఐటీ శాఖ అధికారులు విజయ్ ని   5 గంటల పాటు విచారించడం ఆసక్తికరంగా మారింది. అయితే విజయ్ ఇంటితో సహా  కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే భారీ మొత్తంలోనే నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.అయితే  గత మూడేళ్ల క్రితం విజయ్ పై  ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మరోసారి విజయ్ పైన ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేసి మరీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 

 

 

 ప్రస్తుతం విజయ్ ఐటీ శాఖ అధికారులు దాడులపై  అభిమానులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ పై ఐటీ శాఖ అధికారుల దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని  అభిమానులు ఆరోపిస్తున్నారు. అదిరింది సినిమాలో  జిఎస్టి పై  విజయ్ సెటైర్లు వేయడం... బిగిల్  సినిమాలో కూడా బీజేపీ పార్టీ ని టార్గెట్ చేస్తూ విజయ్ పలు సెటైరిక్  డైలాగులు చెప్పడం...అంతే కాకుండా విజయ్  రాజకీయాల్లోకి రాబోతున్నడు  అంటూ వార్తలు రావడం... వంటి అంశాల కారణంగా బిజెపి విజయ్  పై ఐటీ శాఖ అధికారులతో సోదాలు  చేయిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు అభిమానులు. ఏదేమైనా ప్రస్తుతం  హీరో విజయ్ పై ఐటీ శాఖ అధికారులు సోదాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: