తారక్ లేకపోతే నా ఫిలింగ్ అలా ఉండేది : చరణ్
టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అనుకున్న తేదీ ప్రకారమే ఈ సినిమాను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకున్నట్టు సమాచారం.
అయితే చరిత్రలో కలవని స్వతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనే కాల్పనిక కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, బ్రిటిష్ యువతి ఒలీవియా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ ఐపోతుంది.
ఈ సినిమాలో నటిస్తున్న హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎప్పుడూ ఎంతో సన్నిహితంగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలు తారక్ తో కలిసి పని చేయడం తనకు ఎంతో ఇష్టమని రామ్ చరణ్ తెలిపారు. తారక్ షూటింగ్ లో ఉంటే ఎంతో సందడి ఉంటుందని రామ్ చరణ్ తెలిపారు. ఒకవేళ షూటింగ్ లో ఎన్టీఆర్ లేకపోతే అతన్ని చాలా మిస్ అవుతాను అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. చాలా కాలం నుంచి తాము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చిన రామ్ చరణ్...తమ మధ్య ఉన్న బంధం కారణంగానే షూటింగ్ ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాము అని తెలిపారు.