నీకు అర్ధమవుతోందా..??... మొత్తం నువ్వే చేసావు సామి.....!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు, ఓవరాల్ గా యావరేజ్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటించిన మహేష్ బాబు, తన అద్భుత నటనతో మంచి పేరు దక్కించుకున్నప్పటికీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరవడం జరిగింది. అయితే ఈ సినిమాపై కొందరు ఫ్యాన్స్ సైతం బహిరంగంగా కొన్ని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సూపర్ హిట్ కొట్టవలసిందని, కానీ దర్శకుడు అనిల్ వల్లనే సినిమా కేవలం యావరేజ్ దగ్గరే ఆగిపోయిందని అంటున్నారు.
నిజానికి గతంలో ఆయన తీసిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు మంచి ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్, కథనం రాసుకున్న అనిల్ రావిపూడి, ఈ సినిమాకు మాత్రం ఆశించిన రేంజ్ లో కథను సిద్ధం చేయలేదని, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ పై మొదటి నుండి ఊదరగొట్టిన అనిల్, అందులో కొన్ని సీన్స్ లో ఒకింత ఫోర్స్డ్ కామెడీని పెట్టి ఆడియన్స్ ని కొంత ఇబ్బందిపెట్టారని అంటున్నారు. అదిమాత్రమే కాక సెకండ్ హాఫ్ కూడా చాలా సాగదీసి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడని అంటున్నారు. అయితే కేవలం సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాక మహేష్ ఫ్యాన్స్ ని సైతం తనకు ఇష్టంవచ్చిన రీతిలో సినిమా తీసి ఇబ్బందిపెట్టిన అనిల్ రావిపూడి,
ఓవరాల్ గా సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోవడానికి ముఖ్య కారకుడని, ఆయనకు ఇప్పటికైనా అర్ధమవుతోందా అని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ తో ఓపెనింగ్స్ సూపర్బ్ గా రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికే చాలా చోట్ల తన దూకుడిని తగ్గించిందని, మరొక రెండు రోజుల తరువాత పండుగ ముగియగానే సినిమా పరిస్థితి మరింత దిగజారిపొతుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కావున ఇకనైనా మహేష్ బాబు తన తదుపరి సినిమాలకు ఎంచుకునే దర్శకుల విషయమై కథతో పాటు కథనాన్ని పక్కాగా తెరకెక్కించేలా పూర్తి శ్రద్ధ తీసుకోవాలని ప్రేక్షకులు, అలానే కొందరు ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు......!!