సరిలేరు నీకెవ్వరు: పండుగ కాదు గానీ ఎంటర్ టైన్ చేస్తాది !
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మీక కలిసి జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.. ఈ చిత్రం నుండి విడుదల అయిన అన్నీ సినిమాపై భారీ అంచనాలు అందుకున్నాయి.. అందుకనే ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ను అందుకుంది కాగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతుంది..
ఎప్పుడెప్పుడా అని ఎదుుచూస్తున్న అభిమానుల కోసం ఈ చిత్రం ఈరోజు ఈ చిత్రం విడుదలైంది.. ముందుగా అనుకున్న విధంగా ఈ చిత్రం మంచి హిట్ నీ అందుకుంటుంది అని మహేష్ అభిమానులు అభిప్రపడ్డారు.. ఇంకా ఈ సినిమా కూడా అలానే ఉంది.. అదిరిపోయే రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ తీసుకుంది.. ఎటు చూసినా మొత్తానికి ఈ సినిమా బొమ్మ అదిరిపోయే రేంజులో హిట్ అయిందని చెప్పాలి..
అసలు విషయానికొస్తే.... కెప్టెన్ అఫ్ ది షిప్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. రాను రాను ఈయన సినిమాల్లో కథ అనేది కొరవడుతోంది. అది ఈ ‘సరిలేరు నీకెవ్వరు’లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెరీ వెరీ సింపుల్ లైన్ ని కథగా తీసుకున్నారు. అందుకే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ ఏం లేక సినిమా తేలిపోయింది. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కథనంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది. అందుకే మహేష్‌బాబు హీరోయిజమే సినిమాను హైలెట్ చేసిందే కాని అనిల్ రావిపూడి కథ, కథనాలు కాదు...
మహేష్ ఒక్కడే ఈ సినిమాను తన భుజాలపై మోసాడు.. కానీ, ఎం లాభం సినిమా విజయానికి తొలి మెట్టు అన్నట్లు ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది... దర్శకుడు అనిల్ చేసిన జిమ్మిక్కులు మొత్తానికి సినిమా హిట్ అయ్యేలా చేశాయని మాటలు వినపడుతున్నాయి..సంక్రాంతి పండుగ కు ఫ్యాన్స్ కు బిరియాని వచ్చిందని అభిమానులు అంటున్నారు..