ఆ హీరోయిన్ చెడ్డ అలవాటును మాన్పించిన వెంకటేశ్ ?

Chakravarthi Kalyan
సినిమా రంగం అనేది ఓ క్రియేటివ్ ఫీల్డ్.. కానీ క్రియేటివ్ వ్యక్తులకు కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి. ఈ అలవాట్లు ఒక్కొక్కరిని బట్టి ఒక్కోలా ఉంటాయి. కొందరికి సిగరెట్ అలవాటు ఉంటే.. మరొకరు మందు లేకుండా ఉండలేరు. ఇంకొకరికి అమ్మాయిల పిచ్చి ఉంటే.. మరొకరికి డ్రగ్స్ పిచ్చి ఉంటుంది. కానీ ఆ దురలవాటును మినహాయిస్తే వాళ్లంతా చాలా క్రియేటివ్ పర్సన్స్ గా పేరున్నవాళ్లే.

అలాగే పాత తరం హీరోయిన్ కు కాఫీ బాగా తాగే అలవాటు ఉండేదట. ఎంతగా అంటే రోజులో కనీసం 20 నుంచి 25 కప్పుల కాఫీ తాగేదట. ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత చెప్పినా ఆ అలవాటు మానుకోలేకపోయిందట. ఆ తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సురేశ్ ప్రోడక్షన్స్ లో పని చేసినప్పుడు వెంకటేశ్ ఆమె అలవాటును బాగా కంట్రోల్ చేశాడట. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని పదే పదే చెప్పేవాడట.

అంతేకాదు.. యూనిట్ నుంచి ఎవరూ ఆమెకు కాఫీ ఎక్కువగా ఇవ్వకుండా కంట్రోల్ చేశాడట. అలా తాను కాఫీ తాగడం తగ్గించేసిందట. అలా తనకు వెంకటేశ్ వల్ల మేలు కలిగిందని చెబుతోంది ఖుష్బూ. ఈ విషయం చెపుతూ ఖుష్బూ ఆనాటి రోజులు గుర్తు చేసుకుంది. తెలుగులో తన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’ గురించి చెబుతూ ఇప్పుడు తలుచుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది అంటోంది. ఈ సినిమా ఆఫర్‌ వచ్చినప్పుడు ‘దక్షిణాది చిత్రాలు వద్దు’ అని కుష్బూ నాన్న చెప్పారు.

కానీ, సురేష్‌ ప్రొడక్షన్స్‌, రాఘవేంద్రరావుగారు.. ఈ కాంబినేషన్‌లో సినిమా తప్పకుండా చేయాలని ఒప్పుకొందట. వెంకటేశ్‌ వైట్‌ అండ్‌ వైట్‌లో వచ్చి నన్ను పలకరించిన సీన్‌ ఇప్పటికీ ఆమె కళ్ల ముందు మెదులుతుందట. తన జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఇదీ ఒకటి అంటుందామె. ఈ కలియుగ పాండవులు సినిమా చేస్తుండగానే నాగార్జునతో ‘కెప్టెన్‌ నాగార్జున’ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘త్రిమూర్తులు’, ‘భారతంలో అర్జునుడు’ ఇలా వరుస సినిమాలు చేసింది ఖుష్బూ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: