కీరవాణి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు... ఈ సారి ఎవరి మీదంటే..?

praveen

సంగీత దర్శకుడు కీరవాణి...  అందించే బాణీలు  ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. అద్భుతమైన స్వరాలను అందిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు కీరవాణి. ఎలాంటి సినిమాకైనా తనదైన శైలిలో సంగీతాన్ని అందిస్తు విజయాన్ని సాధించగలరు కీరవాణి. ఇదిలా ఉంటే కీరవాణి ఏదైనా కార్యక్రమానికి హాజరైన అప్పుడు ఆయన చేతికి మైక్  వచ్చిందంటే చాలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గతంలో ఇలాంటి సంచలన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. తాజాగా మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు హీరోగా ఒక కొడుకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సినిమా మత్తు వదలరా. ఈ సినిమా రొటీన్ కు భిన్నంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించింది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

 


 అయితే తాజాగా మత్తు వదలరా చిత్ర బృందం నిర్వహించిన ఫంక్షన్ కు  కీరవాణి హాజరయ్యారు. మరోసారి ఆయన హీరోలపై సక్సెస్ మీట్ లపై తనదైన శైలిలో కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. నేటి రోజుల్లో సక్సెస్ మీట్ అంటే సినిమా ప్లాప్ అయిన హిట్ అయిన సక్సెస్ మీట్ పెడుతున్నారని  అంటూ కీరవాణి వ్యాఖ్యానించారు. నిజంగా సక్సెస్ మీట్ అనే పదానికి ఈ రోజుల్లో అర్థం మారిపోయిందని... సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్... సినిమా హిట్టయినా సక్సెస్ మీట్ ఏర్పాటుచేసి ఇంకాస్త ప్రచారం కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారంటూ కీరవాణి కామెంట్  చేశారు. ఇందులో తప్పేమీ లేదని మేకర్స్ అనుకుంటూ ఉంటారని... సక్సెస్ మీట్ ను కూడా కామెడీని చేసి పడేసారు అంటూ కీరవాణి చురకలు అంటించారు. 

 


 అయితే కీరవాణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కీరవాణి పై ఇప్పుడు తెగ కౌంటర్లు పడుతున్నాయి. తన కొడుకు సినిమా హిట్ అయింది కాబట్టి కీరవాణి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. అదే పెద్ద హీరో ఫంక్షన్ కి వెళ్లి కీరవాణి ఈ వ్యాఖ్యలు చేయగలరా అంటూ నెటిజన్లు కీరవాణి ని ప్రశ్నిస్తున్నారు. అయితే కీరవాణి టాలీవుడ్ లో ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసాడా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్లు పెట్టి మరీ డబ్బ కొడుతున్నారు అంటే కీరవాణి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే గతంలో బాహుబలి 2 రిలీజ్ టైం లో కూడా కీరవాణి తెలుగు దర్శకులు హీరోలు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: