ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ఒక హారర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అవ్వనుందో చూద్దాం. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఖౌఫ్ అనే థ్రిల్లర్ సినిమా ఈ నెల 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ హీరో నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టింది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి.