సమంత: అలాంటి యాడ్స్ మాత్రమే చేస్తా ?

frame సమంత: అలాంటి యాడ్స్ మాత్రమే చేస్తా ?

Veldandi Saikiran

సమంత ఈ చిన్నదాని పేరుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్ తన హవాను కొనసాగించింది. ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు.



సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానో మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా వరుసగా ఫోటోలు షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. సమంతకు సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఇక సమంత సోషల్ మీడియా వేదికగా అనేక రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు. సమంత ఒక్కో బ్రాండ్ నీ ప్రమోట్ చేసినందుకు కోట్లలో డబ్బులు తీసుకుంటారట.


రీసెంట్ గానే సోషల్ మీడియా వేదికగా సమంత తన ఫాలోవర్లకి క్షమాపణలు చెప్పారు. ఈ సంవత్సరం 15 బ్రాండ్లను వదులుకున్నానని సమంత తెలిపారు. పలు బ్రాండ్లను ప్రమోట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా బాధ్యతలు తీసుకుంటున్నానని సమంత అన్నారు. నా వద్దకు ఎన్నో రకాల యాడ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ ఉత్పత్తులను నాకు తెలిసిన వైద్యులతో పరీక్షలు చేయించిన తర్వాతనే ప్రమోట్ చేస్తానని సమంత తెలిపారు. నేను ప్రమోట్ చేసే బ్రాండ్స్ వల్ల ప్రజలకు హాని కలగదు అని తెలిస్తేనే బ్రాండ్లను ప్రమోట్ చేస్తానని సమంత వెల్లడించారు. ప్రస్తుతం సమంత షేర్ చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: