ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం అంటున్న చిట్టి

frame ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం అంటున్న చిట్టి

MADDIBOINA AJAY KUMAR
అందాల భామ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయం అనవసరం. ఈమె తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే ఈమె సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు. జాతిరత్నాలు మూవీలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, చిట్టి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇందులో ఈమె లాయర్ షామిలీగా మంచి ఫన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో సూపర్ హిట్ ని అందుకుంది.


ఆ తర్వాత ఫరియా అబ్దుల్లాకు, రవితేజ హీరోగా నటించిన రావణసుర సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాతో అంతాగా విజయం అందుకోలేకపోయింది. తరువాత అల్లరి నరేష్ కి జంటగా ఆ ఒక్కటి అడగొద్దు అనే సినిమాలో నటించింది. ఈమె లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, మత్తు వదలరా, కల్కి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన అన్ని సినిమాలలో మంచి పాత్రలను పోషించింది. ఈమె అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది.

 
అయితే ఈ ముద్దుగుమ్మకి మంచి ఆఫర్ వచ్చింది. ఇటీవలే స్టార్ హీరో విజయ్ వారసుడు జసన్ సంజయ్ మెగాఫోన్ పట్టారు. జసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరోగా విష్ణు విశాల్ నటిస్తున్నాడు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్త నిర్మిస్తుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు రేంజ్ మారిపోతుందని నెటిజన్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ అందాల భామ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోకి 'ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం' అనే క్యాప్షన్ ని జతచేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: