ఆ విషయంలో ఉపాసనకు ఛాలెంజ్ చేసిన అమల..
తెలంగాణ లో ఈ మధ్య గ్రీన్ ఛాలెంజ్ బాగా ట్రెండ్ అవుతున్న విషయం బాగా తెలిసిందే .అయితే ఈ నేపథ్యంలో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు మూడు మొక్కలను నాటారు. తెలంగాణ ఎంపి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఒక్కక్కరు మొక్కలను నాటుతో ప్రతి ఒక్క ఇండస్ట్రీ తో పాటుగా అన్ని ప్రాంతాలను కూడా పాకింది..
ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద స్టార్ లు అయిన సుమా, మంచు లక్ష్మి.రాహుల్, శ్రీముఖిలతో పాటుగా పలువురి మూడు మొక్కలను నాటి మరో ముగ్గురికి ఈ మొక్కలను నాటమని పిలుపు నిచ్చారు..ఈ సందర్భంగా చాలా మంది మొక్కలను నాటారు..మొన్న రామ్ లక్ష్మణుల మొక్కలు నాటగా..నిన్న బిగ్ బాస్ బ్యూటీ చెట్లను నాటారు..
ఇప్పుడు తాజాగా అక్కినేని అమల మేగాకొడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరింది.. తాజాగా ఈ విషయం పై అక్కినేని అమల తన ఇంటి ప్రాంగణంలో చెట్లను నాటారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గురు కి ఈ ఛాలెంజ్ విసరడం అనేది బాగుంది..అంటూ తెలంగాణ ఎంపి సంతోష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు..
తన ఇంట్లో మూడు మొక్కలను నాటిన అమలా మాట్లాడుతూ.. చెట్లు మరియు జంతువులు అంటే తనకు చాలా ఇష్టమని అన్నది ..అనంతరం మెగా కోడలు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు ఈ గ్రీన్ ఛాలెంజ్ ను విసిరింది.. అంతేకాకుండా పలువురు సినిమా మరియు రాజకీయ ప్రముఖులతో పాటుగా అందరు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటే దేశంలో రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా పచ్చదనాన్ని పంచుకుంటుంది.. అని అమల అన్నారు..ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పథకాలను తీసుకురావాలి అని ఆమె కోరారు...