మాట తప్పని సాయి తేజ్ మెగా కాంపౌండుకు షాక్ !

Seetha Sailaja

వరస ఫ్లాప్ ల నుండి ‘చిత్రలహరి’ విరామం ఇస్తే ‘ప్రతిరోజు పండగే’ మూవీ తిరిగి సాయి ధరమ్ తేజ్ ను తిరిగి హిట్ ట్రాక్ లోకి తీసుకు వచ్చింది. ఈ మూవీ నిన్నటి సోమవారం కలక్షన్స్ పరీక్షలో కూడ గట్టేక్కడంతో రేపు క్రిస్మస్ హాలిడే కూడ కలిసి రావడంతో ఈ మూవీ గ్యారెంటీ హిట్ అన్నవిషయం ఖరార్ అయింది. 

దీనితో చాలామంది దర్శక నిర్మాతలు సాయి తేజ్ వైపు చూస్తున్నారు. త్వరలో ఇతడి మరొక మూవీ ‘సోలో బతుకే సో బెటర్’ మూవీ షూటింగ్ ను కూడ పూర్తి చేసి మరొక సినిమా వైపు అడుగులు వేయాలని సాయి తేజ్ ఆలోచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ మెగా మేనల్లుడు తీసుకున్న ఒక నిర్ణయంలో మార్పు లేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

సాయి తేజ్ వరస ఫ్లాప్ లలో కొనసాగుతున్నప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ దేవ కట్టాతో ఒక సినిమాను చేస్తానని మాట ఇచ్చాడట. ‘ప్రస్తానం’ లాంటి మంచి సినిమాను తీసిన దేవ కట్టా ఆ సినిమా తరువాత చాల సక్సస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు అని అందరు భావించారు. 

నాగచైతన్యతో తీసిన ‘ఆటోనగర్ సూర్యా’ మంచు విష్ణుతో తీసిన ‘డైనమైట్’ తో పాటు సంజయ్ దత్ ను హీరోగా చేసి హిందీలో తీసిన ప్రస్తానం రీమేక్ కూడ ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం దేవ కట్టతో సినిమాలు చేయడానికి ఎవరు సాహసించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో తేజ్ తాను ఇచ్చిన మాట పై నిలబడి దేవ కట్టాతో తాను సినిమా చేసే విషయంలో తనకు రెండవ ఆలోచన లేదు అంటూ అతడు ఇస్తున్న లీకులు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా మెగా హీరోలు హిట్స్ లేని వారి వైపు చూడరు. అయితే దీనికి భిన్నంగా సాయి తేజ్ ప్రవర్తించడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: