ఈ వయస్సులో ఈ గ్రేస్ బాలయ్యకు బాలయ్యే సాటి!

shami

నందమూరి నట సింహం బాలకృష్ణ రూలర్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కె.ఎస్ రవికుమార్ తో ఆల్రెడీ జై సిం హ సినిమా చేసిన బాలయ్య బాబు మరోసారి రూలర్ గా ఫ్యాన్స్ ను అలరించేందుకు వచ్చాడు. ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా సరే నందమూరి ఫ్యాన్స్ బాలయ్య బాబు నుండి కోరుకునే డైలాగ్స్, ఫైట్స్ మాత్రం అదిరిపోయాయని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ మసాలాకు కేరాఫ్ అడ్రెస్ బి, సి సెంటర్స్ ఆడియెన్స్ చొక్కాలు చించుకునేలా బాలయ్య వీర రసం పండిస్తాడు.

 

ఓ రకంగా బాలయ్యకు ఆ మాస్ ఫాలోయింగ్ ఉండబట్టే ఇప్పటికి స్ట్రాంగ్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. అయితే ఒకప్పుడు అంటే వేరు కాని 60 ఏళ్లు వయసు వచ్చినా సరే బాలయ్య గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని విధంగా సినిమా సినిమాకు తన స్టైల్ మార్చుకుంటున్నాడు బాలయ్య బాబు. అంతేకాదు డైలాగ్ లో గ్రేస్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 

 

ఈ వయసులో ఇలా అన్నిటిలో తన గ్రేస్ చూపించడంలో బాలయ్యకు బాలయ్యే సాటి అని చెప్పొచ్చు. నందమూరి సినిమా చరిష్మాని పెద్దాయన తర్వాత అదే రేంజ్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగించిన బాలయ్య కథ, కథనాల ఎంపిక విషయంలో మాత్రం కరెక్ట్ జడ్జ్ మెంట్ తీసుకోలేకపోతున్నారు. కేవలం మాస్ ఆడియెన్స్ ను అలరించే అంశాలు ఉంటే చాలు కథ ఎలా ఉన్నా చాలు అనేలా బాలయ్య సినిమాలు ఉంటున్నాయి.

 

ఇలా వరుసగా మాస్ సినిమాలు చేసే కొన్నాళ్లు హిట్ సినిమాకు దూరంగా ఉన్నాడు బాలకృష్ణ. మళ్లీ బోయపాటి వచ్చి సింహా తో హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ అదే తరహా కథతో మళ్లీ సినిమాలు చేస్తున్నాడు బాలకృష్ణ. రూలర్ సినిమా ఫస్ట్ టాక్ చూస్తే కేవలం నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే తప్ప రెగ్యులర్ సినిమా ప్రేక్షకులకు సినిమా మెప్పించదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: