హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010-2020: దశాబ్దపు లక్కీ హీరోయిన్ అక్కినేని సమంతానే

Arshu
సినిమా ఇండస్ట్రీని ఏమాయ చేసేసిందో గానీ సమంత కెరీర్ ఇలా సాగుతోంది. సమంతా ఏమాయ చేసావే సినిమా చూసి అక్కినేని నాగేశ్వరావు అప్పట్లో నటించిన సావిత్రి తో పోల్చి చూసాడు. సావిత్రిలాగా నటించమని మంచి కితాబు ఇచ్చాడు. అప్పటి నుండి సమంతా కెరీర్ ముందుకు దూసుకుపోతుంది. వరుస విజయాలను సాధించిన సమంతా కోసం ఇప్పుడు అందరు క్యూ కడుతున్నారు. ఇలా వస్తున్న స్పందన చేసిన సమంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది.

  ఇక స‌మంత విష‌యానికి వ‌స్తే ఈ మ‌ధ్య కాలంలో స‌మంత న‌టిచిన చిత్రాల‌న్నీ దాదాపుగా అన్నీ హిట్లే. ఒక్కో చిత్రంలో ఒక్కో ర‌క‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక్టుట‌కుంటుంది.  వివాహం త‌ర్వాత స‌మంత గ్లామ‌ర్ రోల్స్‌ని కాస్త ప‌క్క‌న పెట్టినా కూడా త‌న క్రేజ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఆమె సెలెక్ట్  చేసుకునే క‌థ‌లు ఆ విధంగా ఉంటున్నాయి. ఎక్కువ‌గా క‌థా బ‌ల‌మున్న చిత్రాల‌ను ఎన్నుకుంటూ చేస్తుంది. రంగ‌స్థ‌లంలో ఓ ప‌ల్లెటూరి అమ్మాయిగా రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న చాలా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ఆ త‌రువాత వ‌చ్చిన యూట‌ర్న్ చిత్రంతో డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో న‌టించి మంచి విజ‌యం సాధించింది. త‌ర్వాత ఓ బేబీ అంటూ ఓ చైనా చిత్రం రీమేక్ ని నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆ చిత్రంలో ఓ డ‌భై ఏళ్ళ వ‌య‌సున్న భామ్మ లాగా ల‌క్ష్మీగారిని అనుస‌రిస్తూ పాత్ర‌కు ప్రాణం పోసింద‌నే చెప్పాలి. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ రోల్స్‌లో చాలా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తూ ప్రేక్ష‌కుల‌తో ఓహో అనిపించుకుంటుంది. స‌మంత వివాహానికి ముందు ఎలా అయితే విజ‌యాలు సాధించిందో వివాహం త‌ర్వాత కూడా అదే విధ‌మైన విజ‌యాలు అందుకుంటుంది. చాలా మంది హీరోయిన్లు వివాహం త‌ర్వాత సినిమాల‌ను ప‌క్క‌న బెట్టే హీరోయిన్లు ఈమె మాత్రం త‌న పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మున్న మంచి క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ అలా ముందుకు సాగిపోతుందనే చెప్పాలి. దాదాపుగా ద‌శాబ్ద‌పు ఒక ప‌దేళ్ళ ల‌క్కీ హీరోయిన్ సమంత అనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: