సమంత సహకారంతో పింక్ రీమేక్ కు కుదిరిన ముహూర్తం !

Seetha Sailaja

‘పింక్’ రీమేక్ లో నటించడానికి పవన్ ను ఒప్పించే విషయంలో అనేక వ్యూహాలు పవన్ పై ప్రయోగించిన దిల్ రాజ్ కు చివరకు అతడు ప్రయోగించిన సమంత సెంటిమెంట్ కు పవన్ నుండి ఎట్టకేలకు స్పందన రావడంతో ‘పింక్’ రీమేక్ షూటింగ్ కు కౌంట్ డౌన్ మొదలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచరం మేరకు ఈ రీమేక్ మూవీ షూటింగ్ సంక్రాంతి తరువాత ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. 

పవన్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి కొంత సమయం పట్టినా ఈ మూవీకి సంబంధించిన ఒరిజినల్ వెర్షన్ లో నటించిన తాప్సీ పాత్రను చేయబోతున్న సమంత పై కీలక సన్నివేశాలను తీసే షెడ్యూల్  సంక్రాంతి తరువాత ప్రారంభం అవుతుంది అన్న లీకులు వస్తున్నాయి. పవన్ సమంతతో కలిసి నటించన ‘అత్తారింటికి దారేది’ మూవీ తరువాత ఎన్నోప్రయోగాలు చేసిన ఆ ప్రయోగాలు సక్సస్ కాని పరిస్థితులు ఉన్నాయి.  

ఈ పరిస్థితులలో సెంటిమెంట్ గా సమంత లక్కీ సెంటిమెంట్ ‘పింక్’ రీమేక్ కు అన్నివిధాల కలిసి వస్తుందని  దిల్ రాజ్ భావించడమే కాకుండా ఇదే సెంటిమెంట్ ను దిల్ రాజ్ పవన్ పై ప్రయోగించి ఎట్టకేలకు అతడి డేట్స్ తీసుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య లేటెస్ట్ గా దిశ పై జరిగిన అత్యాచార సంఘటనతో మహిళా లపై జరుగుతున్న అత్యాచార విషయాలకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారడంతో ప్రస్తుతం రగులుతున్న ఈ వేడి ‘పింక్’ రీమేక్ విజయానికి అన్నివిధాల కలిసి వస్తుందని దిల్ రాజ్ పవన్ కు అర్ధం అయ్యేలా వివరించి నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని జూన్ లో విడుదలచేసి పవన్ రీ ఎంట్రీకి గ్రాండ్ గా వ్యూహాలు అనుసరించాలని దిల్ రాజ్ స్పష్ట మైన ప్లాన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కోరుకున్న సామాజిక స్పృహ ‘పింక్’ కధలో ఉన్నపటికీ కేవలం కోర్ట్ స్కీన్స్ ఎక్కువగా ఉండే ఈమూవీలో సగటు ప్రేక్షకుల  భావోద్వేగాలను రెచ్చగొట్టే సీన్స్ చాల తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీని అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యేలా తీయాలి అంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో చాల మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: