డిఫరెంట్ స్టైల్ తో దుమ్ముపుతున్న 'డిస్కో రాజా' టీజర్.....!!

Mari Sithara

మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా తాన్యా హోప్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇటీవల రీరిలీజ్ అయిన నువ్వు నాతో ఏమన్నావో అనే సాంగ్ ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా పెంచేసింది. 

 

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మాస్ మహారాజ ఒక డిఫరెంట్ స్టైల్ లో ఈ టీజర్ లో కనపడి అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇక ఈ టీజర్ ని బట్టి చూస్తుంటే దర్శకుడు విఐ ఆనంద్ తన గత సినిమాలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం మాదిరిగినా ఈ సినిమాని కూడా ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ లో విజువల్స్ ఎంతో గ్రాండియర్ గా ఉండడంతో పాటు సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. 

 

ఇక మొత్తంగా ఎంతో వెరైటీ గా సాగిన ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. ఇక హీరోయిన్స్ లో ఒకరైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ది ఈ సినిమాలో కీలక పాత్ర అని తెలుస్తోంది. మరి వరుసగా కొన్నాళ్ల నుండి అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ సినిమా ఎంత వరకు బ్రేక్ ని ఇస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ పై ఒక లుక్ వేయండి....!!

" height='150' width='250' src="https://www.youtube.com/embed/PDky1zSO7N8" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: