మళ్లీ విజృంభించిన సన్నీ లియోన్.. ఇంటర్నెట్ షేక్ అయ్యిందిగా..
సన్నీ లియోన్.. ఈ పేరు తెలియని నెటిజన్ ఉండరు.. నీలి చిత్రాలతో ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు సినీతార గా రాణిస్తోంది. ఇంటర్ నెట్ లో ఈ అమ్మడు ఓ సంచలనం.. ఆమె కోసం కోట్ల మంది వెదుకుతుంటారు. అందాల ఆరబోతతో.. సెక్సీ లుక్స్ తో ఓ రేంజ్ లో సెగలు రేపుతుందీ అమ్మడు. అందుకే ఆమె మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రెటీగా పేరు తెచ్చుకుంది. ఇంటర్ నెట్ లో అత్యధికంగా ఈమె గురించే వెదుకుతుంటారు.
అలా ఎక్కువగా సెర్చ్ అయ్యే సెలబ్రెటీల ర్యాంకులను ఏటా ప్రకటిస్తుంటారు. ఆ జాబితాలో బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచింది సన్నీ లియోన్. ప్రముఖ సంస్థ యాహూ ప్రతి సంవత్సరం ఓ నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇందులో నెట్టింట్లో ఏ సెలబ్రిటీ గురించి ఎక్కువ మంది అన్వేషించారో తెలియజేస్తుంది.
‘యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ’ పేరిట వాళ్ల వివరాలు ప్రకటిస్తుంది. 2019 ఏడాదికి నటి సన్నీ లియోన్ ఈ లిస్ట్ లో టాప్ ర్యాంక్ కొట్టేసింది. 2019 లోనే కాదు.. 2016, 2017లోనూ సన్నీ లియోనే ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. కాకపోతే.. ఈ 2019లో ఈ అమ్మడు ఫస్ట్ ప్లేస్ ను మరో స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ తో కలిపి పంచుకుంది. ఈ ఏడాది అత్యధిక మంది ఈ ఇద్దరి గురించి వెతికారట.
ఇక సన్నీలియోన్, సల్మాన్ ఖాన్ తర్వాత స్థానంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. ఏదేమైనా ఇలా సంవత్సరాల తరబడి ఫస్ట్ ప్లేస్ లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం సన్నీ సెక్సీ లుక్స్ తోనో.. సెక్సీ ఇమేజ్ తోనే వచ్చిన ర్యాంక్ కాకపోవచ్చు. ఎందుకంటే అలాంటి క్రేజ్ సంవత్సరాల తరబడి కొనసాగదు. మరి సన్నీలో అంతగా నెటిజన్లకు నచ్చిందేంటో మరి.