బర్నింగ్స్టార్కి తృటిలో తప్పిన ప్రమాదం
టాలీవుడ్ లో ఓ వింత సెంటిమెంట్ ఉంది అదేమిటో తెలియదు కాని ఎవరికైనా ఒక చెడు జరిగిందంటే చాలు అది వరసబెట్టి జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. మొన్ననే హీరో రాజశేఖర్ కారుకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించిన కారు రోడ్డు పై మూడు పల్టీలు కొట్టడంతో కార్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అదృష్టవశాత్తు కార్ బెలూన్స్ ఓపెనవ్వడంతో ఆయన చిన్న చిన్న గాయాలతో భయటపడ్డాడు. ఆ సంఘటన మరువకే ముందే మరో నటుడి కారు ప్రమాదం టాలీవుడ్ లో సంచలనమైంది.
సినీ నటుడు సంపూర్ణేష్ బాబు స్వల్పంగా గాయాల పాలయ్యారు. కొద్దిసేపటి క్రితం సిద్దిపేటలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారుని ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొడనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో సంపూతో పాటు ఆయన భార్య, కూతురు కూడా ఉన్నారు. వీళ్లకు కూడా స్వల్పగాయాలయ్యాయి. ఈముగ్గుర్నీ ప్రాధమిక చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కంగారు పడాల్సిందేం లేదని, సంపూకి, కుటుంబ సభ్యులకు అయిన గాయాలు చాలా చిన్నవని సంపూర్ఱేష్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సంపూ ఫ్యామిలీని ఆసుపత్రికి తరలించారు. పోలీసుకులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుసగా కారు సెలబ్రిటీలకు కార్ ప్రమాదాలు జరుగుతుండడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది దీన్ని సెంటిమెంట్‌గా కూడా ఫీలవుతున్నారు. ఈ ఘటన సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ దగ్గర చోటుచేసుకుంది. దీంతో కారు వెనుకభాగం దెబ్బతింది. ఇకపోతే ఇదిలా ఉంటే సాధారణంగా లావుగా ఉండే సంపూర్ణేష్‌బాబు ఇప్పుడు తదుపరి సినిమా కోసం స్లిమ్ కావడానికి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకోవడమే కాదు.. అందుకు తగినట్లు జిమ్‌లో బాగానే కష్టపడుతున్నాడు.